వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల బిల్లుకు ఆమోదం: జగన్ ఉత్సాహవంతుడని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఉద్యోగుల పదవీ విరమణను అరవయ్యేళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అనుభవం ఉన్న ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటే బాగుంటుందన్నారు. సమస్యల పరిష్కారంలో సీనియర్ ఉద్యోగుల సేవలు అవసరమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. చాలామంది ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నారన్నారు.

Chandrababu introduced Bill in AP Assembly

ఉద్యోగాలు అంటే ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదన్నారు. ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాల్సి ఉందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే ఉద్యోగం వచ్చే వరకు రూ.1000 నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు.

జగన్ యువకులు, ఉత్సాహవంతులు

కాగా, చంద్రబాబు ఉద్యోగుల పదవీ విరమణ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందు... తనను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ... తనను ఎన్నుకున్నందుకు చంద్రబాబు, జగన్‌లకు కృతజ్ఞతలు అన్నారు. జగన్ యువకులు.. ఉత్సాహవంతులు.. సభకు చక్కగా సహకరించాలని మండలి అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu introduced Bill in Assembly on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X