వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవస్థలను మేనేజ్ చెయ్యటంలో చంద్రబాబు ఘనుడు .. అందుకే స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన అన్న వైసీపీ నేతలు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , ఆళ్ళ రామకృష్ణారెడ్డి లు . ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వారు పరిశీలించారు. ఈసీపై , ఈవీఎంల భద్రతపై తమకు పూర్తిగా నమ్మకం వుందని చెప్పారు.

<strong>పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జ‌గ‌న్‌ది క్రిమిన‌ల్ మ‌న‌స్త‌త్వం.. పాల్ సంచలనం</strong>పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జ‌గ‌న్‌ది క్రిమిన‌ల్ మ‌న‌స్త‌త్వం.. పాల్ సంచలనం

ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందన్నారు. కచ్చితంగా చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే తీర్పును ప్రజలు ఇచ్చి ఉంటారని వారన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని నేతలు స్పష్టం చేశారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. తమకు భారతదేశంలోని వ్యవస్థలపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఎలక్షన్‌ కమిషన్‌ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారన్నారు.

Chandrababu is an expert in the management of the systems .. Thus the leaders of the YCP examined the strong rooms

తమకు భద్రతపై నమ్మకం ఉన్నప్పటికీ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించిన అనంతరం వారు చంద్రబాబుపై చండ్రనిప్పులు చెరిగారు.

English summary
The YCP leaders Modugula Venugopal Reddy and Alla Ramakrishna Reddy examined EVMs in Acharya Nagarjuna University in Guntur District. We are fully confident about the security of EVMs . Even though they believe in security, they told that Chandrababu is an expert to manage the control of the systems. After examining the strong rooms of EVMs they commented on Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X