వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నా హీరో, నా డబ్బంతా ప్రజలకే, అడ్డుకోలేరు: కమల్ హాసన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాట రాజకీయ ప్రవేశం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం ఉదయం ఆయన తన రాజకీయ యాత్రను ప్రారంభించేందుకు రామేశ్వరానికి చేరుకున్నారు.

Recommended Video

Kamal Hassan Party Launch Update

మొదట మత్స్యకారులతో భేటీ అయిన ఆయన.. స్థానిక హయత్ ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాగా, కమల్ రాగానే 'సీఎం వచ్చారు' అభిమానులు నినాదాలు చేయడం గమనార్హం.

 చంద్రబాబే హీరో

చంద్రబాబే హీరో

కాగా, కమల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జాతిపిత మహాత్మాగాంధీ అభిమానని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన హీరో అని, తనకు ఆయనే స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చారు. మంగళవారం రాత్రి చంద్రబాబు తనకు ఫోన్ చేశారని, ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాలపై సలహాలు, సూచనలు చేశారని కమల్ చెప్పారు.

రక్షణగా ఉంటా

రక్షణగా ఉంటా

తనకు కార్యకర్తలు, అభిమానులు తనకు శాలువాలు కప్పుతున్నారని.. ఇంకెప్పుడూ ఇలా చేయవద్దని వారిని కోరారు కమల్. అంతేగాక, తానే వారందరికీ శాలువాగా మారి రక్షణ ఉంటానని చెప్పారు.

నన్ను అడ్డుకోలేరు..

‘రామేశ్వరంలో కలాం చదివిన పాఠశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ, పాఠశాల యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు. పాఠశాలకు రాకుండా అడ్డుకోగలిగారు కానీ.. తాను నేర్చుకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరు' అని కమల్ స్పష్టం చేశారు.

రాజకీయాల్లో బాధ్యత ఎక్కువ

రాజకీయాల్లో బాధ్యత ఎక్కువ

‘తమిళనాడు ప్రజల గుండెల్లో నేనున్నాను. ఇప్పుడు వారి ఇళ్లలోనూ ఉండాలనుకుంటున్నాను. సినిమాలకు, రాజకీయాలకు పెద్ద తేడా లేదు. రెండు రంగాలూ ప్రజలకే కోసమే. కానీ, సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది' అని కమల్ పేర్కొన్నారు.

నా డబ్బంతా ప్రజలదే.. వాటికి హాజరుకాను

అంతేగాక, ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదేనని కమల్ చెప్పుకొచ్చారు. కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అని చాలా మంది తనను అడుగుతున్నారని.. అయితే తాను సాధారణంగా అంత్యక్రియలకు హాజరుకానని కమల్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయ యాత్రం ప్రారంభించిన కమల్.. తన పార్టీ వివరాలను కూడా వెల్లడించనున్నారు.

English summary
‘Last night, I spoke with Chandra Babu Naidu and he explained how more than ideals, it is important to understand what people need and put a list of things that you can do for them. What he said struck a chord with me. He is an inspiration for me,’ said Cine Actor turned politician Kamal Haasan on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X