మెగాస్టార్..జగన్ ని ప్రాధేయపడాలా- కేసీఆర్ వ్యాఖ్యల ప్రస్తావన : హోదా పైనా ఇలా - చంద్రబాబు...!!
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రత్యేక హోదా అంశం పైనా స్పందించారు. కేంద్ర హోంశాఖ అజెండాలో హోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైకాపా నేతలు ఇప్పుడు టీడీపీ పైన బురద చల్లుతున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రత్యేక హోదా పైన యుద్దం చేయకుండా...జగన్ రెడ్డికి పలాయవాదం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేవంలో తాజా రాజీకీయాల పైన చర్చించారు.

చిరంజీవి సీఎంను ప్రాధేయ పడాలా
రాష్ట్రంలో
ఆర్దిక
వ్యవస్థ
ను
నాశనం
చేసారంటూ
మండిపడ్డారు.
ఈశాన్య
రాష్ట్రాలకంటే
దారుణంగా
ఏపీని
దిగజార్చారని
ఆగ్రహ
వ్యక్తం
చేశారు.
లేని
సమస్యను
సృష్టించి
జగన్
సినిమా
హీరోలను
ఘోరంగా
అవమానించారన్న
చంద్రబాబు..
స్వశక్తితో
ఎదిగిన
మెగాస్టార్
చిరంజీవి
లాంటి
వారు
జగన్ను
ప్రాధేయపడలా
అని
ఆక్షేపించారు.
ప్రపంచ
స్థాయికి
ఎదిగిన
తెలుగు
సినిమా
పరిశ్రమను
కించపరిచారని
దుయ్యబట్టారు.
గ్రామాల్లో
విద్యార్థులకు
బడులను
దూరం
చెయ్యడమే
నాడు-నేడు
పథకమని
విమర్శించారు.

కేసీఆర్ వ్యాఖ్యల పరోక్ష ప్రస్తావన
పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసీపీ అవినీతిపై తెలుగు దేశం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోయినా.. అధిక బిల్లులు వస్తుండటాన్ని తప్పుపట్టారు. కరెంట్ సరఫరా లేదు కానీ.. అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం అదనపు రుణాల అనుమతి కోసం రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని కండీషన్ పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. తాను అందుకు అంగీకరించలేదని.. ఏపీలో మాత్రం ఇప్పటికే 25 వేల మంది రైతుల మోటార్లకు మీటర్లు బిగించారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సినీ హీరోలతో చర్చల పై నాడు - నేడు
అయితే, సినిమా పరిశ్రమకు చెందిన హీరోలతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశం పైన కొద్ది రోజుల క్రితం సైతం చంద్రబాబు విమర్శలు చేసారు. లేని సమస్యను సృష్టించి..సినిమా వాళ్ల పొట్టకొట్టి..వారిని బెదిరించారంటూ వ్యాఖ్యానించారు. దీని పైన మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. అసలు సినీ పరిశ్రమలో సమస్యలు తీసుకొచ్చిందే చంద్రబాబు అంటూ కౌంటర్ ఇచ్చారు. తాము ఏం చర్చించామో ..చంద్రబాబు మీటింగ్ లోకి వచ్చి విన్నారా అంటూ నిలదీసారు. అయితే, సినిమా పరిశ్రమ తో జరిపిన చర్చల్లో టీడీపీ ప్రధానంగా చిరంజీవి అంతగా ప్రాధేయ పడాలా అనే అంశం పైన పదే పదే ప్రస్తావన చేస్తోంది. సినీ హీరోలు సీఎంతో సమావేవం తరువాత తమ సమస్యలకు పరిష్కారం లభించిందని భావిస్తుంటే... చంద్రబాబు బాధ ఏంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు.