వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిపోతామని తెలిసే చంద్రబాబు దండుకునే హడావిడి .. చంద్రబాబుపై జీవీఎల్ సంచలనం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్‌పై, ఏపీ సీఎస్ పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు .రాష్ట్రంలో అధికారం పోతుందని తెలిసి అవకాశం ఉన్న చోట్ల దండుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పుడు తపనపడుతున్నారని ఆరోపించారు.

<strong>చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి .. వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతి</strong>చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి .. వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతి

చంద్రబాబు సమీక్షల విషయంలో రాద్దాంతం అందుకే అంటున్న జీవీఎల్

చంద్రబాబు సమీక్షల విషయంలో రాద్దాంతం అందుకే అంటున్న జీవీఎల్

చంద్రబాబు సమీక్షల విషయంలో రాద్ధాంతం చేయడం తగదని అన్నారు జీవీఎల్ . ఐదేళ్లలో ఏమీ చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికిప్పుడు సమీక్షలు చేయడం ద్వారా ఎంతో జరుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులు కరువుతో దిక్కుతోచని స్థితిలో ఉంటే చంద్రబాబు ఏ సమీక్ష చేశారని జీవీఎల్ ప్రశ్నించారు. ఇప్పుడు సమీక్షల పేరుతో చంద్రబాబు నానా హంగామా సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సంఘంతో చర్చించే కేంద్రం నిర్ణయం తీసుకుంటోంది అన్న జీవీఎల్

ఎన్నికల సంఘంతో చర్చించే కేంద్రం నిర్ణయం తీసుకుంటోంది అన్న జీవీఎల్

చంద్రబాబు ఎన్నికల కోడ్‌ పేరిట రాద్ధాంతం చేసి చంద్రబాబు తన ఓటమికి ఇతర సంస్థలను బాధ్యులను చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆమాత్రం చంద్రబాబుకు తెలియదా అంటూ సెటైర్లు వేశారు.

ప్రతీవిషయం రాజకీయం చెయ్యాలని చూస్తే ఒత్తిడి పెరుగుతుందన్న జీవీఎల్

ప్రతీవిషయం రాజకీయం చెయ్యాలని చూస్తే ఒత్తిడి పెరుగుతుందన్న జీవీఎల్

రైల్వే జోన్‌ను ప్రకటించే సమయంలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన కోడ్‌ అమల్లో ఉన్నందున కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చెయ్యాలని చూసి చంద్రబాబు తనపై తానే ఒత్తిడి పెంచుకుంటున్నారని అన్నారు జీవీఎల్ . అన్నిటినీ రాజకీయం చెయ్యాలని చూస్తే ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు .

English summary
BJP MP GVL Narasimha Rao said Chandrababu would not make any allegations against review meetings . It is ridiculous to say that Chief Minister Chandrababu, who has not done anything in five years, is still going through the reviews. GVL questioned what Chandrababu had done if the farmers in the state were in a state of drought. Now, the names of reviews are being created a biggest scene by Chandrababu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X