జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..
రెండేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుపు వాపు మాత్రమేనని, ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుందని సవాళ్లు విసిరిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఎదురుదెబ్బలు తగలడంతో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అది తప్పని నిరూపించేలా స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు.. కుప్పంలో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నందమూరి అభిమానులైన శ్రేణులు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడైందిలా..
ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి..

చంద్రబాబుకు ఎన్టీఆర్ సెగ
రెండు రోజుల పర్యటన కోసం కుప్పం విచ్చేసిన చంద్రబాబు, శుక్రవారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వీలైన చోటల్లా పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కుప్పం జగన్ జాగీరు కాదని, కుప్పంలోనే మకాం వేసి.. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని ఆయన ప్రతినబూనారు. అయితే, అనూహ్య రీతిలో బాబుకు ఓ చేదు అనుభవం కూడా ఎదురైంది. టీడీపీ అధినేతకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో సెగ తగిలింది..
కరోనా విలయంలో చైనా అద్భుతం -ఆకలి కేకలు సమాప్తం -కడు పేదలు లేరంటూ జిన్‌పింగ్ ప్రకటన

కుప్పంలో తారక్ ఫ్యాన్స్ హల్చల్
టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా సార్లు జూనియన్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం, నందమూరి వారసులకు తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వ్యక్తం కావడం సహజంగా జరిగేదే. అయితే, ఎన్టీఆర్ పేరుతో ఏకంగా చంద్రబాబును అడ్డుకునే స్థాయిలో దృశ్యాలు మాత్రం తొలిసారి కుప్పంలో ఇవాళ చోటుచేసుకున్నాయి. చంద్రబాబు పర్యటన సందర్భంలో కుప్పంలో ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలతో భారీ ఎత్తున ఫ్లెక్లీసు వెలిశాయి. అంతేకాదు, వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ముందు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. శుక్రవారం శాంతిపురంలో..

జూనియర్ రాకపై బాబు మౌనం..
చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే తారక్ ఫ్యాన్స్ అడ్డుపడ్డారు. రెండేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతిన్న దరిమిలా జూనియర్ ఎన్టీఆర్ ను వెంటనే పార్టీలోకి ఆహ్వానించాలని, టీడీపీలో కీలక బాధ్యతలను తారక్ కు అప్పగించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసిన అభిమానులు... చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జూనియర్ రాకపై అభిమానులు గట్టిగా నినాదాలు చేయడంతో చంద్రబాబు మాట్లాడటం ఆపేసి, కాసేపు మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై..

జగన్ దెబ్బకు కుప్పంలో పడ్డాడు..
చంద్రబాబు కుప్పం పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ కోసం కార్యకర్తల నినాదాలు, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తదితర అంశాలపై వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాబలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ చీఫ్ చంద్రబాబు మళ్లీ కుప్పం గల్లీలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇవ్వాలని ప్రస్తుత సీఎం జగన్ ను కోరడం ఎపిక్ దృశ్యమన్నారు. టీడీపీకి ఇంతటి దారుణమైన దుస్థితి పట్టడానికి కారణాలను కూడా అంబటి వెల్లడించారిలా..

లోకేశ్ వల్లే సైకిల్ తునాతునకలు
‘‘40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ సీఎం అయిన చంద్రబాబుకు ఇవాళ సొంత గడ్డ కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప కుప్పంలో ప్రచారానికి టీడీపీకి దిక్కులేదన్నట్లుగా పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్ననాడే మేనిఫెస్టోను అమలు చేయలేకపోయిన బాబు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి హామీలు నెరవేరుస్తాడా? నిజానికి లోకేశ్ వచ్చిన తర్వాతే టీడీపీకి దుర్గతి పట్టింది. నారా లోకేశ్ వల్లే సైకిల్ తునాతునకలు అయింది. జగన్ అనే గన్నుకు తూటాలు ఉన్నాయి కాబట్టే లోకేశ్ మంగళగిరిలో తుస్సుమన్నాడు. పాపం లోకేశ్ మానసిక పరిస్థితి చూస్తే జాలేస్తోంది. భువనేశ్వరిగారైనా కొడుకుపై శ్రద్ధతీసుకోవాలి'' అని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.