వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై కేసులు కొట్టేస్తే ఏమనుకుంటారు, సలాం కొడ్తారా: కేంద్రంపై బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి రోజు నుంచి కేంద్రం దుర్దుద్దేశంతోనే వ్యవహరిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు తమ హక్కు అని, ఇవి ఇవ్వాలని అడిగితే ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు.

నిధులను ఇతర పథకాలకు మళ్లించే అలవాటు కేంద్రానికి ఉందేమో గానీ తనకు లేదని చంద్రబాబు అన్నారు. ఇంతగా అబద్దాలు మాట్లాడుతూ అంత దుర్మార్గం చేస్తారా అని అడిగారు. తనకు దురుద్దేశాలు అంట గడుతారా అని ప్రశ్నించారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

 పన్నులు వసూలు చేసుకుని...

పన్నులు వసూలు చేసుకుని...

మన వద్ద పన్నులు వసూలు చేసుకుని రాయితీలు ఇవ్వరా అని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇన్ని గొడవలు జరుగుతుంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చి ఎపికి ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ ఎవరికీ ఇవ్వడం లేదని చెబుతూ ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చారని ఆయన అన్నారు.

ప్రజలే హైకమాండ్

ప్రజలే హైకమాండ్

తనకు ప్రజలే అధిష్టానమని చంద్రబాబు అన్నారు. కేంద్రంపై తాము జపాన్ తరహా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిజమైన కోఆపరేటివ్ ఫెడరలిజానికి టిడిపి ఆదర్శమని చంద్రబాబు అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. విద్యా సంస్థలకు రూ.11,672 కోట్లు అవసరమవుతాయని అన్నారు.

అధికారం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుతారా

అధికారం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుతారా

అధికారం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చననే పద్ధతిలో అమిత్ షా లేఖ రాశారని చంద్రబాబు అన్నారు. ప్రధాని కార్యాలయం ఏ విధంగా పనిచేస్తుందో దానికి ఇది ఒక ఉదారహణ మాత్రమేనని అన్నారు. యూసీలు ఇచ్చారు నిధులు ఇవ్వాలని ఆర్థక సంఘం చెప్తే ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడం ఏ రోజు కూడా జరగలేదని అన్నారు

ఆ నిధులన్నీ రాజధానికి కాదు

ఆ నిధులన్నీ రాజధానికి కాదు

ఎపి రైల్వేకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు. రాజధానికి 2500 కోట్లు విడుదల చేశామని అమిత్ షా చెప్పారని, అందులో నిజం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మున్సిపాలిటీలకు ఇచ్చారని, రాజధానికి కాదని అన్నారు.

అవన్నీ ఇక్కడే ఉంటే..

అవన్నీ ఇక్కడే ఉంటే..

గ్యాస్ ఆయిల్ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అదేదో ఎపికి సాయం చేస్తున్నట్లు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. అది ఇక్కడే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సౌరశక్తికి 800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చారని అన్నారు. అందులో ప్రత్యేకంగా ఎపికి ఇచ్చింది కాదని, అందరికీ ఇచ్చినట్లు మనకు ఇచ్చారని అన్నారు.

వాస్లవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా..

వాస్లవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా..

వాస్తవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమిత్ షా రాసిన లేఖ తప్పుల తడక అని, ఇది రాష్ట్ర ప్రజలంతా చదవాలని, తాను చేసే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. ఎపి హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.

అలా చెప్తే కేసులు పెట్టిస్తా అంటున్నారు...

అలా చెప్తే కేసులు పెట్టిస్తా అంటున్నారు...

పిఎంవోలో విజయసాయి రెడ్డి దాగుడుమూతల గురించి చెప్తే ఇక్కడే ఉంటా, కేసులు పెట్టిస్తా అని అంటున్నారని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి పిఎంవోలో ఉంటే ఎలా అర్థం చేసుకుంటారని చంద్రబాబు అన్నారు. ఈ స్థితిలో జగన్‌‌పై కేసులు కొట్టేస్తే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించాలని అన్నారు.

అది అమిత్ షా ఆలోచించుకోవాలి...

అది అమిత్ షా ఆలోచించుకోవాలి...

వారు మిమ్మల్ని వాడుకుంటున్నారా, మీకు వారు ఉపయోగపడుతున్నారా అనేది అమిత్ షా ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం విభేదించినప్పుడు సరి చేస్తే చేయండి, లేదంటే కాలమే సరి చేస్తుందని, కాలం ఎవరి కోసం ఆగదని అన్నారు. ఇన్న సమస్యలు ఉంటే ఒక్క పార్టీ మాట్లాడడం లేదని అన్నారు.

కేసుల కోసం ఢిల్లీలో ఉండి..

కేసుల కోసం ఢిల్లీలో ఉండి..

రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉంటే కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు అన్నారు. మీ కోసం ఢిల్లీలో ఉండే ప్రభుత్వానికి సలాం కొట్టి చరిత్రహీనులుగా మిగిలిపోతారా, ప్రజల కోసం కలిసి వస్తారా ఆలోచించుకోవాలని ఆయన వైసిపిని హెచ్చరించారు. ఇదే విధంగా చేస్తే కాంగ్రెసు ఏమైందో బిజెపి అదే అవుతుందని హెచ్చరించారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu lashed out at PM Narendra Modi's Union government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X