వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షిపై దాడి చేతకాదా: బాబు, చెప్పినట్లే: బాలయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. జగన్‌కు చెందిన సాక్షిపై దాడి చేయాలంటే తమ పార్టీవాళ్లకు చేత కాదా అని ఆయన అన్నారు. కల్తీ మద్యాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నమ్ముకుందని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. మోడీతో రెండు సార్లు మాట్లాడానని చెప్పారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తారని ఆయన అన్నారు. హత్యా రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టబోనని ఆయన అన్నారు. తప్పు చేసినవారంత చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నరాు.

పోలింగ్ కేంద్రాల వద్ద వైసిపి దాడులకు పాల్పడిందని ఆయన ఆరోపిచారు. ఐపిఎస్‌లపై దాడి చేయడం దారుణమని ఆయన అన్నారు. తాను అధైర్యపడబోనని ఆయన అన్నారు. తమ నాయకులకు అవమానం జరిగిందని చెప్పారు. కాంగ్రెసు కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిందని చంద్రబాబు అన్నారు. ఈసి, గవర్నర్ తీరుపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. చర్యలు తీసుకునే బాధ్యత వాళ్లకు లేదా అని అడిగారు. విషం పెట్టి చంపినా ఇలాగే వదిలేస్తారా అని ప్రశ్నించారు. జగన్ మదమెక్కిన ఏనుగులా ప్రవర్తించారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Chandrababu lashes out at YS Jagan's Sakshi

కాగా, తెలుగుదేశం పార్టీలో తన పాత్ర అధ్యక్షుడి సూచనల మేరకే ఉంటుందని బాలకృష్ణ బుధవారం హిందుపురంలో అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో తాను మంచి మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఓటింగు శాతం పెరగడానికి యువతే ప్రధాన కారణమని ఆయన అన్నారు. అభివృద్ధికి ఓటేయాలని తాను ప్రచారం చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. ప్రణాళిక ప్రకారం హిందూపురం సమస్యలను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. హిందూపురం ప్రజలంతా ఓ కుటుంబం వంటివారని ఆయన అన్నారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu has lashed out at YSR Congress party president YS Jagan and his sakshi media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X