అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాక్ టు భాగ్యనగరం: లోకేశ్‌తో కలిసి రోడ్డుమార్గంలో సిటీకి చంద్రబాబు, మహానాడు ముగియడంతో...

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కుమారుడు లోకేశ్‌తో కలిసి రోడ్డుమార్గంలో భాగ్యనగరం వస్తున్నారు. వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు ఏపీ వెళ్లారు. కానీ విశాఖపట్టణానికి విమాన సర్వీసు ప్రారంభం కాకపోవడంతో వెళ్లడం వీలేకాలేదు. కానీ ఈ నెల 27, 28వ తేదీల్లో జూమ్ యాప్ ద్వారా అమరావతి నుంచి మహానాడు నిర్వహించారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఇక్కడే ఉండిపోయారు. మార్చి 22 నుంచి దాదాపు రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ.. నేతలతో నిత్యం సంప్రదింపులు జరిపారు. అయితే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనుకొన్నారు.

chandrababu, lokesh come back to hyderabad

Recommended Video

AP Govt Extends Build AP E-auction For 15 Days

హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లేందుకు కేంద్రానికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించింది. తర్వాత ఏపీ డీజీపీకి లేఖ రాయగా.. వచ్చేందుకు అనుమతిచ్చారు. కానీ కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భౌతికదూరం విధిగా పాటించాలని, మాస్క్‌లు పెట్టుకోవాలని స్పష్టంచేశారు. అమరావతి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలపై చంద్రబాబు ఫోకస్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ నెల 27, 28వ తేదీల్లో మహానాడును నిర్వహించారు. పలు తీర్మానాలు చేసి, ఆమోదించి... కార్యకర్తలో కొత్త ఉత్సాహం నింపారు. తర్వాత తిరిగి కుమారుడు లోకేశ్‌తో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు.

English summary
tdp national president chandrababu naidu, and his son lokesh come back to hyderabad after complete mahanadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X