వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు కౌంటర్: చంద్రబాబు వ్యూహం ఇదీ, కేంద్ర మంత్రులు రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదా సాధనకు తమ పార్లమెంటు సభ్యుల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

Recommended Video

YS Jagan Fools People name of MPs resignation

జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల చేత ఆయన రాజీనామా చేయిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రధాని మోడీ మంత్రి వర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరి, పి. అశోక్ గజపతి రాజు ఉన్నారు.

చంద్రబాబు కీలక భేటీ

చంద్రబాబు కీలక భేటీ

చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కీలక నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలనే విషయంపై ఆయన సమావేశంలో చర్చిస్తున్నారు. జగన్‌ను కౌంటర్ చేయడానికి తీవ్రమైన నిర్ణయం తీసుకోక తప్పదనే భావనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

మొదటి చర్యగా రాజీనామాలు

మొదటి చర్యగా రాజీనామాలు

మొదటి చర్యగా కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారి చేత రాజీనామా చేయించాలని వైయస్ జగన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సుజనా చౌదరి, అశోక గజపతి రాజు చేత రాజీనామా చేయిస్తే జగన్ వ్యూహాన్ని కొంత మేరకు దెబ్బ కొట్టవచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ను చూస్తే నవ్వు వస్తోంది

జగన్‌ను చూస్తే నవ్వు వస్తోంది

పాదయాత్రలో జనగ్ చేస్తున్న వాగ్దానాలను చూస్తే నవ్వు వస్తుందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసిపి రాజీనామాల నాటకం ఆడుతోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ప్రజలను ఫూల్స్‌ను చేసేందుకే...

ప్రజలను ఫూల్స్‌ను చేసేందుకే...

మరోసారి రాష్ట్ర ప్రజలను ఫూల్స్‌ను చేసేందుకే జగన్ డ్రామాలు ఆడుతున్నారని గంటా శ్రీనివాస రావు అన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామాలు చేస్తామని అనడం డ్రామా కాక మరేమంటారని అడిగారు. జనగ్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సహనంతో ముందుకెళ్తామని ఆయన అన్నారు.

English summary
It is said that Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu may ask his union ministers to esign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X