వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశ్రామిక ప్రతినిధుల హామీ, హ్యాపీగా బాబు వెనక్కి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

దావోస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ పరికరాల పరిశ్రమ ఏర్పాటుకు ఏబీబీ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉల్రిచ్ స్పెస్ఫర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ప్రత్యేకంగా వారు చర్చించారు.

విదేశీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం దావోస్‌లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన శనివారం ముగిసింది. అనంతరం ఆయన తిరుగు పయానమయ్యారు. చంద్రబాబు దావోస్‌లో పలు దేశాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏబీబీ గ్రూప్ స్విట్జర్లాండుకు చెందిన బహుళజాతి కంపెనీ.

ఫిబ్రవరిలో స్విట్జర్లాండు నుండి ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని ఉల్రిచ్ ఏపీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమ స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను తమ బృందం పరిశీలిస్తుందని చెప్పారు. చంద్రబాబు జీఐసీ గ్రూప్ అధ్యక్షుడు షియోంగ్ గుయాన్‌తో భేటీ అయ్యారు.

 చంద్రబాబు

చంద్రబాబు

సమాచార సాంకేతిక పరిజ్ఞానం నుంచి పర్యాటక రంగం దాకా.. మౌలిక సదుపాయాల కల్పన నుంచి అయిల్‌ రిఫైనరీ వరకూ .. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ఒక గమ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రపదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా విస్త్రత స్థాయిలో పలు సంస్థలకు తమ బృందం అవగాహన కల్పించిందని తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

భారత్‌లో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలని, తమ రాష్ట్రం, సన్‌రైజ్‌ స్టేట్‌గా అభివృద్ధి చెందనున్నదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఐసీ గ్రూప్ (గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టుమెంట్ కార్పోరేషన్) అధ్యక్షుడు షియోంగ్ గుయాన్‌తో భేటీ అయ్యారు.

English summary
AP CM CHANDRABABU Meeting With Group President of GIC LimSiong Guan, Singapore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X