విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ ప్రాధాన్యత లేదు, ఇక ఇక్కడే: కేంద్రమంత్రితో బాబు భేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తలెత్తిన రాజకీయ పరిణామాలు, తెలంగాణ మీడియాలో ఏపి ప్రభుత్వానికి ప్రాధాన్యత లభించకపోవడంతో ఇకపై జరిగే అన్ని సమావేశాలను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం ఆయన గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.

కానీ, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం విశాఖలో పర్యటించడంతో చంద్రబాబునాయుడు కూడా విశాఖకు చేరుకున్నారు. ఆయనతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి ఓఎన్‌జిసి, ఆయిల్ రిఫైనరీ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. సమావేశం తరువాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించినా, వాటికి తగిన ప్రాధాన్యత మీడియాలో లభించడం లేదని అన్నారు.

మన రాష్ట్రంలోనే సమావేశాలు నిర్వహించడం వలన సమస్యలపై క్షుణ్ణంగా చర్చించడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. తనకు ఇప్పుడు కాస్త ఉపశమనంగా ఉందని అన్నారు.

కాగా, కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైను నిర్మాణం జరుగుతోందని, విజయవాడ నుంచి నెల్లూరుకు మరో పైపులైను నిర్మాణంలో ఉందని వివరించారు. ఏపీలో ఆయిల్‌ రిఫైనరీ గానీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ గానీ పెట్టాలనే యోచన ఉందని, రిఫైనరీ కంటే పెట్రో కాంప్లెక్సే ఉపయోగకరంగా ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్‌ సూచించారు. దీనిపై ఓ కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామన్నారు.

కేంద్రమంత్రితో బాబు

కేంద్రమంత్రితో బాబు

రాష్ట్రంలో అందరికీ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు ఇంకా 41 లక్షల కనెక్షన్లు అవసరమని, వాటిని కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

కేంద్రమంత్రితో బాబు

కేంద్రమంత్రితో బాబు

వచ్చే రెండేళ్లలో అవి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 20 లక్షల పైప్‌లైన్‌ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు.

కేంద్రమంత్రితో బాబు

కేంద్రమంత్రితో బాబు

జూన్ 27 నుంచి గెయిల్‌ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా ప్రారంభమవుతుందన్నారు.

కేంద్రమంత్రితో బాబు

కేంద్రమంత్రితో బాబు

రాష్ట్రంలోని సహజ వనరులపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి గురువారం విశాఖపట్నంలో ఆయన నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

కేంద్రమంత్రితో బాబు

కేంద్రమంత్రితో బాబు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైను నిర్మాణం జరుగుతోందని, విజయవాడ నుంచి నెల్లూరుకు మరో పైపులైను నిర్మాణంలో ఉందని వివరించారు.

కేంద్రమంత్రితో బాబు

కేంద్రమంత్రితో బాబు

ఏపీలో ఆయిల్‌ రిఫైనరీ గానీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ గానీ పెట్టాలనే యోచన ఉందని, రిఫైనరీ కంటే పెట్రో కాంప్లెక్సే ఉపయోగకరంగా ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్‌ సూచించారు. దీనిపై ఓ కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామన్నారు.

‘స్థానిక ఇంధన వనరులపై పరిశోధనలకు పెట్రోలియం యూనివర్సిటీ అవసరం. దానికి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గర మాధవరం అనుకూలంగా ఉంటుందని కేంద్రానికి సూచించాం. వీలైతే వచ్చే ఏడాది (2015-16) నుంచే అది పనిచేసే అవకాశం ఉంది' అని చంద్రబాబు వివరించారు.

ల్యాండ్‌ ఆఫ్‌ లా ప్రకారం సముద్ర భూగర్భం నుంచి వెలికితీసే ఇంధన వనరులపై రాయల్టీని పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నామని, ఈ విషయంలో 19వ స్టాండింగ్‌ కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పామని వివరించారు. ఈ ప్రతిపాదనను ప్రధాని దగ్గర పెట్టడానికి పెట్రోలియం మంత్రి అంగీకరించారన్నారు.

English summary
Chief Minister N Chandrababu Naidu has said that he requested Minister of Petroleum and Natural Gas Dharmendra Pradhan to pay onshore and offshore royalty on the gas and oil exploration in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X