• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పారడైజ్ ఎఫెక్ట్: 'త్వరగా పాదయాత్ర ముగించిన జగన్, ఆకలితో ఉన్న జంతువు కంటే'

|
  Paradise Papers Leak effect To JAGAN : పాదయాత్ర ఆపేసిన జగన్ | Oneindia Telugu

  అమరావతి: పారడైజ్ పేపర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంశం వెలుగు చూసింది. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దేశంలో ఏ కుంభకోణం బయటపడినా జగన్ పేరు బయటకు రావడం ఆనవాయితీ మారిందన్నారు.

  పారడైజ్ షాక్, కేంద్రమంత్రి, మాన్యతా నుంచి జగన్ వరకు: ఎవరి పేరు ఎందుకు?

  దీనివల్ల ఏపీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తోందని చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్ఫంగా ఆయన మాట్లాడారు. పారడైజ్‌ పత్రాల్లో జగన్ పేరుపై చర్చ జరిగింది.

  కలకలం: పాదయాత్ర టైంలో వైసీపీకి భారీ షాక్, పారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరు

   పారడైజ్ పైన సమాధానం చెప్పలేని స్థితిలో జగన్

  పారడైజ్ పైన సమాధానం చెప్పలేని స్థితిలో జగన్

  జగన్‌ పాదయాత్రకు ప్రజా స్పందన అనుకున్న దాని కంటే తక్కువగానే ఉందని పార్టీ నేతలు ఈ సందర్భంగా చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పారడైజ్‌ పత్రాల విషయంలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

   అందుకే సోమవారం త్వరగా ముగించారు

  అందుకే సోమవారం త్వరగా ముగించారు

  అందుకే సోమవారం నాటి పాదయాత్ర త్వరగా ముగించారని నేతలు.. చంద్రబాబుతో చెప్పారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చెప్పారు.

   శిక్ష పడేందుకు కొంత సమయం

  శిక్ష పడేందుకు కొంత సమయం

  కాకపోతే శిక్ష పడటానికి కొంత సమయం పడుతుందని, ప్యారడైజ్‌ పత్రాల్లో జగన్ పేరు బయటపడటం సిగ్గుచేటు అని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలతో అన్నారు.

  714 మంది ఆర్థిక నేరగాళ్లలో జగన్‌ది ప్రత్యేక స్థానం

  714 మంది ఆర్థిక నేరగాళ్లలో జగన్‌ది ప్రత్యేక స్థానం

  పారడైజ్‌ పత్రాల్లో జగన్‌ పేరు ఉండడంపై మంత్రులు మండిపడ్డారు. ఆర్థిక నేరాల్లో జగన్‌కు ప్రపంచస్థాయి ప్రత్యేక హోదా లభించిందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. పన్ను ఎగవేతదారుడు, ఆర్థిక నేరగాడు పాదయాత్ర చేయడం ప్రపంచ చరిత్రలోనే లేదని, 714 మంది భారతీయ ఆర్థిక నేరగాళ్లలో ప్రత్యేక స్థానం పొందారని, ఇది రాష్ట్రానికే అవమానమని వ్యాఖ్యానించారు. జగన్‌ ఆఫ్‌షోర్‌ లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని కళా వెంకట్రావు అన్నారు.

   దొంగ వస్తున్నాడంటూ ప్రజలు పారిపోతున్నారు

  దొంగ వస్తున్నాడంటూ ప్రజలు పారిపోతున్నారు

  జగన్‌ పాదయాత్ర చూసి దొంగ వస్తున్నాడంటూ ప్రజలు పారిపోతున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. బాబు పోతే జగన్‌కు జాబ్ వస్తుందని, జనం నెత్తిన టోపీ వస్తుందని, ఈ విషయం ప్రజలదరికి తెలుసునన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జగన్‌ సమాధానం చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు.

   ఆకలితో ఉన్న జంతువు కంటే జగన్ ప్రమాదకరం

  ఆకలితో ఉన్న జంతువు కంటే జగన్ ప్రమాదకరం

  ఆకలితో ఉన్న జంతువు కన్నా జగన్‌ వంటి అత్యాశపరుడు ప్రమాదకరమని దేవినేని ఉమామహేశ్వర రావు హెచ్చరించారు. జగన్‌ చేసేది ప్రజా సంకల్ప యాత్ర కాదని, అది ప్రజా వంచన యాత్ర అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పాదయాత్ర చేయాల్సిన సమయం, సందర్భం ఉన్నాయా అని అమర్నాథ్ రెడ్డిప్రశ్నించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Apppleby’s records show details of financial transactions related to Nimmagadda Prasad, an industrialist from Andhra Pradesh who was arrested in May 2012 as an accused in one of the clutch of cases filed by the CBI against YSR Congress Chief, Y S Jagan Mohan Reddy, an investigation by The Indian Express reveals.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more