వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా జగన్ పార్టీ కుట్ర, 40 చోట్ల ఇబ్బంది: చేతులెత్తేసిన బాబు! సీ ఓటరు సర్వేపై ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అమరావతి: మరో పదహారు నెలల్లో ఎన్నికలు వస్తాయని, వాటికి సిద్ధం కావాలని, అతివిశ్వాసం మంచిది కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు హితబోధ చేశారు. ప్రస్తుతం ప్రజల్లో టీడీపీకి ఆదరణ ఉందని చెప్పారు. 120 నుంచి 130 నియోజకవర్గాల్లో మనకు సానుకూలంగా ఉందని, ఇంచార్జులు ఉన్నచోటే ఇబ్బంది అని చెప్పారు.

ఆయన పార్టీ సమన్వయ భేటీలో నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిద్దామని చెప్పారు. మనకు ఉన్న విపక్షం వైసీపీ ఒక్కటేనని, గత ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.67 మాత్రమేనని, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి 16 శాతం ఓట్లు అదనంగా వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో ఇదే ఫలితం రావాలన్నారు.

 చేతులెత్తేసిన చంద్రబాబు

చేతులెత్తేసిన చంద్రబాబు

కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ప్రజల్లో సానుకూలత తెచ్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లానని, ఎమ్మెల్యేలు, ఇంచార్జులు తమ తప్పులతో పాడు చేసుకుంటే నేను ఏమీ చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశారు! విచ్చలవిడితనం ఉంటే 128 ఏళ్ల కాంగ్రెస్ పరిస్థితి మనకు వస్తుందని, ఇగోలు పక్కన పెట్టాలన్నారు. 130 వరకు చోట్ల ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ నలభై, యాభై నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు.

వస్తే తీసుకోండి, చాలినన్ని పదవులు

వస్తే తీసుకోండి, చాలినన్ని పదవులు

ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే తీసుకోవడానికి సిద్ధమని చంద్రబాబు చెప్పారు. కిందిస్థాయి నేతలు వచ్చినా తీసుకోవాలన్నారు. పార్టీలోకి వచ్చే వారు ఇప్పుడున్న వారికి పోటీ కాదని, సర్దుబాటు చేసేందుకు చాలినన్ని పదవులు ఉన్నాయని చెప్పారు. మరో 40 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టం కావాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం దాటి జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. ఎమ్మెల్యేల పని తీరును ఏ, బీ, సీ కేటగిరిలుగా చేశానని, ఏ పర్వాలేదని, బీ కేటగిరీ వారిని పిలిచి మాట్లాడుతానని, సీ కేటగిరీ వారితో ఇంచార్జ్ మంత్రులు మాట్లాడాలని సూచించారు.

జగన్ పార్టీ కుట్ర

జగన్ పార్టీ కుట్ర

గత ఎన్నికల్లో మనతో లేని సామాజిక వర్గాలు ఇప్పుడు మనవైపు వచ్చాయని, మనకు దగ్గరైన వర్గాలకు సంబంధించి ఆయాచోట్ల ఘర్షణలు పెంచి జగన్ పార్టీ వైసీపీ తన సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందని, ఆ కుట్రలను మొగ్గలోనే తుంచివేయాలని చంద్రబాబు అన్నారు. మరోవైపు, కొందరు ఎమ్మెల్యేల పని తీరు కారణంగా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ వైపు జనాలు మొగ్గు చూపేందుకు దోహదం చేస్తోందని, దీనిని మొగ్గలోనే మీరే తుంచివేయాలని, లేదంటే నేను మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. తద్వారా అలాంటి వారిని మార్చేస్తానని చెప్పారు. అన్ని వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ కోసం కొంచెం ఎక్కువ సమయం కేటాయించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు అధినేతను కోరారు. మంత్రి యనమల రామకృష్ణుడు సమర్థించారు.

 సీ ఓటరు సర్వే తప్పు

సీ ఓటరు సర్వే తప్పు

ఏపీలో టీడీపీకి అనుకూలంగా లేదని తేల్చిన సీ ఓటరు సర్వే తప్పు అని చంద్రబాబు అన్నారు. రిపబ్లికన్‌ టీవీ సీఓటర్‌ సర్వే ఒక బూటకమని, ప్రజలు టీడీపీని వ్యతిరేకించడానికి కారణం ఏముంది? అడిగినవీ, అడగనవీ కూడా చేశామని, అడగనివి కూడా చేశామని, చరిత్రలో జరగని పనులు చేసినప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వస్తుందని, తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉండి కూడా అన్ని రంగాల్లో వృద్ధి చూపించామని చెప్పారు.

ఏపీలో సింగరేణి భూమి అమ్మేసుకుంటామంటున్నారు

ఏపీలో సింగరేణి భూమి అమ్మేసుకుంటామంటున్నారు

విభజన హామీల విషయంలో తాను కోర్టుకు వెళ్తానని చెప్పింది కేంద్రం పైనో, బీజేపీ పైనో పోరాటం కోసం కాదని, హక్కుల సాధన కోసమేనని చంద్రబాబు చెప్పారు. దీనిని కేంద్రానికి లేదా బీజేపీకి వ్యతిరేకంగా చూపించడం సరికాదన్నారు. ముఖ్యంగా 9, 10 షెడ్యూళ్లలోని సుమారు రూ.30, 40వేల కోట్ల విలువైన
ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని, వాటి పంపకానికి సంబంధించి హైకోర్టులో మనకు అన్యాయం జరిగిందని, జనాభా ప్రాతిపదికన అప్పులు పంచినప్పుడు, ఆస్తులు కూడా అదే దామాషాలో పంచాలని, ఉదాహరణకు సింగరేణి సంస్థకు చెందిన రూ.750 కోట్ల విలువైన భూమి మన రాష్ట్రంలో ఉందని, దానిలో తెలంగాణకు 51 శాతం వాటా ఉండటంతో దాన్ని అమ్మేసుకుంటామని అంటున్నారని, ఇలాంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే చివరి అస్త్రంగా కోర్టుని ఆశ్రయిస్తామనే తాను చెప్పానని చంద్రబాబు అన్నారు. ఆంధ్రా పాలకులు హైదరాబాద్‌లో విధ్వంసం చేశారని కేసీఆర్‌ అనడం సరికాదన్నారు. జగన్‌ వంటి విపక్ష నాయకులు ఎలాంటి అనుభవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవడం నిమిషం పని కాదని, కాని దాని వల్ల నిధులు వస్తాయా అన్నారు. పసికందులాంటి నవ్యాంధ్రను మరో 12 ఏళ్లు పోషించాలని, అప్పుడే స్వయం పోషకం అవుతుందన్నారు. పోలవరంపై గడ్కరీ అపోహపడినా తర్వాత అర్థం చేసుకున్నారని చెప్పారు.

English summary
TDP National President and AP CM Nara Chandrababu Naidu meeting with party leaders on Satur day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X