వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిధులిచ్చాం, అమరావతి వెళ్తే ఏం కనిపించదు: బాబుపై గోయల్ ఎదురుదాడి, అవిశ్వాసంపై

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ కోసం నిధులు అడిగారని, కానీ అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు.

చదవండి: ఎవరితో మాట్లాడలేదు, అందరినీ కూడగట్టను: బాబు ఊహించని ట్విస్ట్, పవన్‌కు హెచ్చరిక

చంద్రబాబు ఎన్డీయేలో నుంచి వెళ్లిపోవడం, అవిశ్వాసం పెట్టడం వెనుక వాస్తవం కంటే సెంటిమెంట్ ఎక్కువగా ఉందన్నారు. విభజన చట్టం హామీల మేరకు వంద శాతం అమలు పరుస్తున్నామన్నారు.

చదవండి: చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్

అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చాం

అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చాం

తాము రాజధాని అమరావతి కోసం రూ.2500 కోట్లు ఇచ్చామని, కానీ అక్కడ ఏమీ జరగలేదని ఆరోపించారు. వాస్తవం కంటే సెంటిమెంట్ ఆధారంగా అవిశ్వాసం పెట్టారని అభిప్రాయపడ్డారు. ఆయన న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడారు.

నిధులు అడుగుతున్నారు కానీ

నిధులు అడుగుతున్నారు కానీ

ఈశాన్య రాష్ట్రాలకు మినహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం తెలిపిందన్నారు. చంద్రబాబు నిధులు అడిగారని, కానీ ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయలేదన్నారు.

అమరావతికి వెళ్తే ఏమీ కనిపించదు

అమరావతికి వెళ్తే ఏమీ కనిపించదు

చంద్రబాబు నిధుల పరంగా సాయం చేసినా ఏపీకి చేయడంలో విఫలమయ్యారని పీయూష్ గోయల్ అన్నారు. ఇప్పడు అమరావతికి వెళ్తే అక్కడ మనకు ఏమీ కనిపించదని విమర్శించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు.

డబ్బులు అడుగుతున్నారే కానీ పనులు చేయట్లేదు

డబ్బులు అడుగుతున్నారే కానీ పనులు చేయట్లేదు

తాము ఏపీకి అన్ని ఫండ్స్ ఇచ్చామని పీయూష్ గోయల్ తెలిపారు. ఆయన డబ్బులు అడుగుతున్నారే కానీ ఆ నిధులతో అభివృద్ధి పనులు చేయడంలో విఫలమవుతున్నారని చెప్పారు.

అందుకే అవిశ్వాసానికి ఆ పార్టీల మద్దతు

అందుకే అవిశ్వాసానికి ఆ పార్టీల మద్దతు

పైగా చంద్రబాబే డ్రామా యుద్ధం అంటున్నారని పీయూష్ గోయల్ మండిపడ్డారు. చట్టబద్దమైన హామీలన్నింటికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు మద్దతు పలకడం ఆ పార్టీల క్రెడిబులిటికీ సంబంధించిన అంశంగా మారిందన్నారు.

English summary
With Andhra CM Chandrababu Naidu pulling out of the NDA alliance at the Centre on Friday and moving a no-confidence motion against the government over the special category status, Railways minister Piyush Goyal said the decision was more "sentimental than factual".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X