వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల టైంలో రూ.3వేలు ఇస్తే 5వేలు అడగండి: జగన్, పవన్ కళ్యాణ్‌పై సెటైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి/గుంటూరు: సీఎంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని గట్టిగా పట్టుపట్టి ప్రధాని మోడీని డిమాండ్‌ చేసి ఉంటే కచ్చితంగా వచ్చేదని, కానీ ఏపీ సీఎం చంద్రబాబు స్వలాభం కోసం ఏనాడూ అలాంటి ప్రయత్నం చేయలేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు.

అందిన కాడికి దోచుకోవటం, ప్రజలను మోసం చేయటం, నమ్మిన వారిని మోసం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలని నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్ల పాలన ఇలాగే సాగిందన్నారు. ఆయన గుంటూరు జిల్లా పాదయాత్రలో మాట్లాడారు. హెదా డిమాండును టీడీపీ అన్ని రకాలుగా నీరుగార్చిందన్నారు.

పెళ్లాం, పిల్లలుంటే తెలిసేది: మోడీపై జేసీ తీవ్రవ్యాఖ్యలు, 'చంపుతారా.. చైనా, రష్యాలా ఉంది'పెళ్లాం, పిల్లలుంటే తెలిసేది: మోడీపై జేసీ తీవ్రవ్యాఖ్యలు, 'చంపుతారా.. చైనా, రష్యాలా ఉంది'

వస్తోంది అసలు మనిషేనా అని అనుమానం వస్తోంది

వస్తోంది అసలు మనిషేనా అని అనుమానం వస్తోంది

హోదా కోసం అంటూ ఇప్పుడు చంద్రబాబు సైకిల్ యాత్రలు చేస్తున్నారని, ఆయన అసలు మనిషేనా అనే సందేహం వస్తోందని జగన్ అన్నారు. లంచం ఇవ్వనిదే రాష్ట్రంలో పని జరగడం లేదన్నారు. స్వయానా సీఎం ఇంటి చుట్టూ ఇసుకను దోపిడీ చేస్తున్నారని, కృష్ణా నది గర్భాన్ని తొలిచే పనిని ఆధునిక యంత్రాలతో సాగిస్తున్నారన్నారు.

స్వయంగా చంద్రబాబు అవినీతిలో భాగస్వామిగా

స్వయంగా చంద్రబాబు అవినీతిలో భాగస్వామిగా

చంద్రబాబు స్వయంగా అవినీతిలో భాగస్వామిగా ఉన్నారని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్ల వరకు, ఆపై చివరకు పెదబాబుకు సైతం వాటాలు ఉండటం బహిరంగ రహస్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో పచ్చ చొక్కాలు తప్పించి సాధారణ ప్రజానీకం ఎవరూ సంతోషంగా లేరన్నారు. తిరిగి ఎన్నికలు రానున్నందున గతంలో ఇచ్చిన తప్పుడు హామీల మాదిరిగానే ఈసారి మరిన్ని ప్రకటిస్తారని, వాటిని ఎవరూ నమ్మరన్నారు.

 ఎన్నికల సమయంలో రూ.3వేలు ఇస్తే రూ.5వేలు డిమాండ్

ఎన్నికల సమయంలో రూ.3వేలు ఇస్తే రూ.5వేలు డిమాండ్

ప్రతి ఇంటికి ఒక కిలో బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తానని చంద్రబాబు చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కొందరు మనుషులు వచ్చి రూ.మూడు వేలు చేతిలో పెడతారన్నారు. అయితే వారి నుంచి రూ.ఐదు వేలు డిమాండ్‌ చేయాలన్నారు. అదంతా మన డబ్బేనని, దోచుకుని తిరిగి మనకే ఇస్తున్నారని గ్రహించాలన్నారు. ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని టీడీపీ నెరవేర్చలేదన్నారు. పవన్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారని, పవన్ సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు అనుకూలంగా ఉంటేనే అఖిల పక్షానికా?

చంద్రబాబుకు అనుకూలంగా ఉంటేనే అఖిల పక్షానికా?


శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలమైన వారినే అనుమతిస్తున్నారని, అసలు ఇది అఖిలపక్షమా? బాబు పక్షమా? అని అఖిలభారత ముస్లిం లీగ్‌, నవతరం పార్టీ నాయకులు ఆరోపించారు. సమావేశానికి ఆహ్వానించి లోనికి అనుమతించలేదని వారు శనివారం సచివాలయంలో ఆందోళన చేపట్టారు. సచివాలయంలోని రెండో బ్లాకు ముందు బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu betrayed AP Special Status Says YSRCP chief YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X