వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు చెప్పొద్దు!: ముగ్గురికి దిమ్మతిరిగేలా చంద్రబాబు సమాధానం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావులకు కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావులకు కౌంటర్ ఇచ్చారు.

దానికేం సంబంధం, నేనే పోరాడుతా: పవన్ కళ్యాణ్‌కు బాబు షాక్దానికేం సంబంధం, నేనే పోరాడుతా: పవన్ కళ్యాణ్‌కు బాబు షాక్

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పవన్, జగన్‌లు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జనవరి 26న ఆర్కే బీచ్‌లో జరగనున్న సభకు వారు వేర్వేరుగా మద్దతు తెలిపారు. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

chandrababu naidu

అసలు, జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. హోదాతో సమానంగా ప్యాకేజీ ఇచ్చినందువల్లే అంగీకరించానని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగితే తానే పోరాడుతానని తేల్చి చెప్పారు. తాము ఎక్కడా రాజీపడమన్నారు.

అంతేనా, వస్తారా?: పవన్ కళ్యాణ్ టు వరుణ్‌లకు యువత హెచ్చరిక, సవాల్అంతేనా, వస్తారా?: పవన్ కళ్యాణ్ టు వరుణ్‌లకు యువత హెచ్చరిక, సవాల్

పోలవరం నిర్మాణంపై.. కేవీపీకి

పోలవరం ప్రాజెక్టు తామే కట్టామని చంద్రబాబు స్కోత్కర్ష చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని పలుమార్లు కేవీపీ చెప్పారు. అంతేకాదు, ఆయన చంద్రబాబుకు లేఖలు కూడా రాశారు. దీనిపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు.

విభజన సమయంలో మాట్లాడని వాళ్లు ఇప్పుడు లేఖలు రాస్తున్నారని, ఆ లేఖలు ఏవో అప్పుడు రాస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. పోలవరం పనులు తాము చేపట్టకుంటే ముందుకు కదిలేదా అని నిలదీశారు. ఇప్పుడు లేఖలు రాసే బదులు అధికారంలో ఉన్నప్పుడు కట్టవచ్చు కదా అని నిలదీశారు.

పోలవరం ఇష్యూపై..

పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాడు రాజధాని భూసేకరణ దగ్గర నుంచి ఉద్దానం వరకు ఇదే విధానాన్ని అవలంభించింది. అయితే కొద్ది రోజుల క్రితం పవన్‌ను పోలవరం, రాజధాని ప్రాంతాల్లోని లంక గ్రామాల రైతులు కలిశారు.

ప్రభుత్వంవైపు నుంచి తమకు అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరం స్పిల్‌వే పనుల్లో భాగంగా తీస్తున్న మట్టిని పంటలు, డంపింగ్ యార్డుకోసం సేకరించిన భూమిలో వేస్తున్నారు. భూమిని ఇచ్చిన రైతులు తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని గోడు వెల్లబోసుకున్నారు. రైతులకు పవన్ భరోసా ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడొద్దు: రాయపాటిపవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడొద్దు: రాయపాటి

దీనిపై స్పందించిన చంద్రబాబు.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తన ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని చెప్పారు.

రాయపాటి కంపెనీపై..

మరోవైపు పవన్ పోలవరం కాంట్రాక్ట్ పొందిన ఎంపీ రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపైనా విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రస్తుతం పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్ చేయడం లేదని, ప్రభుత్వమే చేస్తోందన్నారు.

రాజధాని ప్రాంతంలోని లంక భూముల రైతులు కూడా పవన్‌ను కలిశారు. ఎకరానికి 1450 గజాల భూమిని ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు.

దీనిపై కూడా చంద్రబాబు సూటిగా స్పందించారు. జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని కొద్దిమందే రైతుల కోసం గొడవలు చేస్తున్నారన్నారు.

అవాస్తవాలే.., ఆ బాధ్యత తీసుకోండి: పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు ఉమ జవాబుఅవాస్తవాలే.., ఆ బాధ్యత తీసుకోండి: పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు ఉమ జవాబు

మిత్రపక్షంగా చూస్తూనే..

జనసేనను మిత్రపక్షంగా చూస్తూనే పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న సమస్యలను వీలైనంత వరకు చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరిస్తోంది. అదే సమయంలో పవన్ చేసే విమర్శలకు స్పందిస్తోంది. బోండా ఉమ కూడా నిన్న స్పందించారు. పవన్ పోలవరం, అమరావతిలకు వెళ్లి చూడాలని హితవు పలికారు. రాయపాటి సాంబశివ రావు కూడా కౌంటర్ ఇచ్చారు.

English summary
AP CM Nara Chandrababu Naidu counter to Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X