వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కన్నా జగన్ బెటర్ .. ఏ విషయంలో అంటారా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ కన్నా జగన్ బెటర్... ఏ విషయంలో అంటారా..? || Oneindia Telugu

తెలంగాణా సీఎం కేసీఆర్ కన్నా ఏపీ ప్రతిపక్షనేత జగన్ చాలా బెటర్ . అదేంటి ? జగన్ చేసింది ఏమిటి? కేసీఆర్ చెయ్యనిది ఏమిటి? ఏ విషయంలో జగన్ కేసీఆర్ కంటే బెటర్ అంటారా ? అయితే ఈ కథనం చూసెయ్యండి.. మీకే అర్ధం అవుతుంది.

రాజకీయ అక్కసుతోనే విగ్రహాల తొలగింపు .. అసలు విషయం బయటపెట్టిన మాజీ ఎంపీ యార్లగడ్డరాజకీయ అక్కసుతోనే విగ్రహాల తొలగింపు .. అసలు విషయం బయటపెట్టిన మాజీ ఎంపీ యార్లగడ్డ

రెండు సార్లు పట్టం కట్టినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లోకి వెళ్ళని తెలంగాణా సీఎం కేసీఆర్

రెండు సార్లు పట్టం కట్టినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లోకి వెళ్ళని తెలంగాణా సీఎం కేసీఆర్

తెలంగాణా సీఎం కేసీఆర్ .. తెలంగాణా ప్రజలు రాష్ట్రానికి ఎంతో చేస్తారని ఆదరించి పట్టం కట్టిన సీఎం. ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు సీఎంగా చేసి తమ సమస్యలు పరిష్కరించు మహా ప్రభో అంటూ ప్రజలు కేసీఆర్ తమ కష్టాలు తీరుస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ సీఎంగా ఉన్నా కేసీఆర్ ఏనాడు ప్రజలకోసం , ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన వినూత్న కార్యక్రమాలు ఏమీ లేవు. కానీ ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించటం తన బాధ్యత అని భావించి కడప జిల్లాలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.

సీఎం కాకముందే ప్రజా క్షేత్రంలో సమస్యలు తెలుసుకుంటున్న ఏపీ ప్రతిపక్షనేత జగన్

సీఎం కాకముందే ప్రజా క్షేత్రంలో సమస్యలు తెలుసుకుంటున్న ఏపీ ప్రతిపక్షనేత జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలో బిజీబిజీగా గడుపుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో బుధవారం ఉదయం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.ఇకపోతే గురువారం కూడా కడప జిల్లాలోనే వైఎస్ జగన్ పర్యటించనున్నారు. 17న తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు వైఎస్ జగన్. మూడు రోజుల పర్యటనలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలతో మమేకం కావటానికి, వారి కష్టాలు తెలుసుకోవటానికి జగన్ సమయం కేటాయించారు. జగన్ చేసిన పని కేసీఆర్ నేటికీ చెయ్యలేకపోయారు.

జగన్ ,తెలంగాణా సీఎం కేసీఆర్ కంటే బెటర్ ఇందుకే

జగన్ ,తెలంగాణా సీఎం కేసీఆర్ కంటే బెటర్ ఇందుకే

జగన్ సీఎం కాకముందే కడపలో ప్రజా దర్బార్ ప్రారంభించి ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే కేసీఆర్ సీఎం అయ్యి ఇంత కాలం అయినా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించటంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అందుకే జగన్ తెలంగాణా సీఎం కేసీఆర్ కంటే బెటర్ అని చెప్పక తప్పదు.

English summary
AP opposition leader Jagan started praja darbar to solve the constituency public problems. but Telangana CM KCR never meet the public to know their problems and never tried to solve them. That's why Jagan is better than Telangana CM KCR. YSR Congress Party leader YS Jaganmohan Reddy is busy in his own district, Kadapa . He is conducting praja Durbar . Two times Telangana people have supported KCR but he didn't work .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X