వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ, నంద్యాల ఫలితాలపై బాబు అసంతృప్తి, ఆ నిర్ణయమే కారణమా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల, కాకినాడ ఫలితాలు టిడిపికి అనుకూలంగా వచ్చాయి. ఈ ఫలితాలు ఏపీ రాజకీయాలకు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.వైసీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. అయితే ఈ తరుణంలో నంద్యాల, కాకినాడ ఫలితాలపై చంద్రబాబునాయుడు తృప్తిగా లేరు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తే నంద్యాల, కాకినాడల్లో ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేవని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

నంద్యాల ఎఫెక్ట్: కర్నూల్ వైసీపీ నేత టిడిపిలోకి, కీలక నేతలపై టిడిపి గురినంద్యాల ఎఫెక్ట్: కర్నూల్ వైసీపీ నేత టిడిపిలోకి, కీలక నేతలపై టిడిపి గురి

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 28వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి 32 డివిజన్లను గెలుచుకొంది. మరో ముగ్గురు రెబెల్స్ కూడ విజయం సాధించారు. బిజెపి నుండి మరో ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు.

భూమా ఎఫెక్ట్: శిల్పాను వెంటాడిన దురదృష్టం, 2 నెలలకే, దెబ్బేనా?భూమా ఎఫెక్ట్: శిల్పాను వెంటాడిన దురదృష్టం, 2 నెలలకే, దెబ్బేనా?

శిల్పా ఎఫెక్ట్: ఫరూక్‌కు పదవి, నంద్యాల మెజారిటీకి కారణమిదే!శిల్పా ఎఫెక్ట్: ఫరూక్‌కు పదవి, నంద్యాల మెజారిటీకి కారణమిదే!

అయితే కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో 30 ఏళ్ళ తర్వాత టిడిపి విజయం సాధించింది. అయినా చంద్రబాబునాయుడుకు తృప్తి లేదు. క్షేత్రస్థాయికి అనుకూలంగా వ్యూహన్ని రచిస్తే ఫలితం మరో రకంగా ఉండేదని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.

నంద్యాల, కాకినాడ ఫలితాలపై బాబు అసంతృప్తి

నంద్యాల, కాకినాడ ఫలితాలపై బాబు అసంతృప్తి

నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నిల్లో వచ్చిన ఫలితాలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నంద్యాల, కాకినాడలో విజయం సాధించినప్పటికీ, ఆ రెండు చోట్లా పార్టీపరంగా ఇంకా కృషి జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కలిసిన నేతల వద్ద వ్యాఖ్యానించారు. కాకినాడలో మరికొంత కష్టపడి ఉంటే మరో మూడు స్థానాలు వచ్చేవన్నది చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అభ్యర్ధుల ఎంపిక, రెండు సామాజికవర్గాలకు టిక్కెట్లు సర్దుబాటు చేసే విషయంలో జరిగిన పొరపాటు, సమయం తక్కువగా ఉండటం కూడ కారణమని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ఆయన అన్న కుమారుడు ఒకరు ఎన్నికల్లో ఓడిపోవటం వంటి సంఘటనలను చంద్రబాబు నేరుగానే ప్రస్తావించారు . కానీ , ఈ విషయాన్ని పార్టీ నేతలు సక్రమంగా పట్టించుకొంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం నెలకొంది.

చినరాజప్పను అభినందించిన బాబు

చినరాజప్పను అభినందించిన బాబు


ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను చంద్రబాబునాయుడు అభినందించారు. యనమల కాకినాడలోనే మకాం వేసి మొత్తం ఎన్నికలను పర్యవేక్షించి, అందరినీ నడిపించిన తీరును చంద్రబాబు ప్రశంసించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తి రాజప్ప. 25 సంవత్సరాలపాటు పార్టీ అధ్యక్షుడిగా కష్టించి పనిచేశారని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.

నంద్యాల మెజారిటీని ఊహించని టిడిపి నేతలు

నంద్యాల మెజారిటీని ఊహించని టిడిపి నేతలు


టీడీపీలో కొంతమంది నేతలు సైతం నంద్యాలలో వచ్చిన మెజారిటీని ముందుగా అంచనా వేయలేకపోయారు. పదివేల మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తే చాలునని భావించారు. వైఎస్ జగన్ ఏకంగా 14 రోజులు నిర్వహించిన ప్రచారం అధికారపార్టీకి కొంత ఆందోళన కూడా కలిగించింది. అయితే నంద్యాలలో వచ్చిన ఫలితం పట్ల నేతలు ఆనందంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలితాన్ని ఇచ్చిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్పు

పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్పు


ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఉన్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహన్ని మార్చుకోవాలని టిడిపి నేతలకు బాబు సూచించారు. ఎన్నికల సమయంలో వ్యూహలను పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని బాబు పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు ప్రత్యర్థులు అనుసరించే వ్యూహం మన పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతోందనే విషయాలను బేరీజు వేసుకొని ముందడగు వేయాలని బాబు పార్టీ నేతలకు సూచించారు.

English summary
Chandrababu naidu dissatisfied on Nandyal, kakinada result.lack of planning in Kakinada elections, lost 3 more seats said babu. Chandrababu naidu appreciated who were worked in kakinada, Nandyal elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X