వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1978లో బాబు విజయానికి కారణమిదే, ఆ వ్యూహమే కలిసొచ్చింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu naidu recalls his previous plan in elections

చిత్తూరు: 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో జనతాపార్టీకి గట్టి పట్టున్నప్పటికీ చంద్రబాబునాయుడు విజయం సాధించారు. ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహం కలిసొచ్చిందని బాబు గుర్తు చేసుకొన్నారు.

2019లో ఏమైనా జరగొచ్చు: బాబు సంచలనం, టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న దూరం 2019లో ఏమైనా జరగొచ్చు: బాబు సంచలనం, టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న దూరం

రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబునాయుడు 40 ఏళ్ళు పూర్తైంది.సుధీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబునాయుడు తన రాజకీయ అనుభవాలను మీడియాకు వివరించారు. రెండు రోజుల క్రితం పలు తెలుగు ఛానళ్ళకు ఇంటర్వ్యూల్లో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి గుర్తు చేసుకొన్నారు.

తొలిసారిగి ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి దోహదం చేసిన పరిస్థితులను బాబు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు.

చంద్రబాబుపై సస్పెన్షన్, 1980లోనే నల్లారి అమర్‌నాథ్‌రెడ్డికి చెక్చంద్రబాబుపై సస్పెన్షన్, 1980లోనే నల్లారి అమర్‌నాథ్‌రెడ్డికి చెక్

రెండేళ్ళ ముందే చంద్రగిరిలో పోటీచేయాలని బాబు ప్లాన్

రెండేళ్ళ ముందే చంద్రగిరిలో పోటీచేయాలని బాబు ప్లాన్

1978 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి దిగారు. అప్పటికి ఆయన ఎస్వీ యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్‌. తన మిత్రులు, సహ విద్యార్థులు వంద మందితో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు. వారంతా చంద్రగిరి నియోజకవర్గంలో ఊరూరుకూ తిరిగారు. ప్రతి ఇల్లు తిరిగి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో జనతా పార్టీకి గట్టి పట్టున్నా బాబు వ్యూహం ఫలించింది పోటీ చేసిన తొలిసారే బాబు విజయం సాధించారు. జనతా పార్టీ అభ్యర్థి కొంగర పట్టాభి చౌదరిని ఓడించి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు.

మోటార్ బైక్‌లపై ప్రచారం

మోటార్ బైక్‌లపై ప్రచారం

మోటార్ బైక్‌లపై ప్రచారం చేసేవారు. 1978లో కార్లు అద్దెకు దొరకడం తక్కువగా ఉండేదని బాబు గుర్తు చేసుకొన్నారు. ఒకటి రెండు కార్లు అద్దెకు దొరికితే ఆ కారు నిండా కూర్చొని ప్రచారానికి వెళ్ళేవాళ్ళమని చంద్రబాబు చెప్పారు. బుల్లెట్‌పై తనతో పాటు మరో ఇద్దరిని తీసుకొని ప్రచారం నిర్వహించినట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. మరోవైపు యెజ్డీ బైక్‌ను బాబు ఉపయోగించేవారు.

బాబు గెలుపులో పాకాల సమితి కీలకం

బాబు గెలుపులో పాకాల సమితి కీలకం

చంద్రబాబునాయుడు గెలుపులో పాకాల సమితి కీలకంగా పనిచేసింది. పాకాల సమితిలో మెజారిటీ ఓట్లు చంద్రబాబునాయుడుకు రావడంతో జనతా పార్టీ అభ్యర్థి పట్టాబిపై బాబు విజయం సాధించారు. . పోలింగ్‌కు కొద్దిరోజుల ముందే ఆ సమితిలో పట్టున్న స్థానిక నేత వద్దకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు. ఏ కారణం చేత మద్దతివ్వాలనే విషయమై బాబు వివరించారు. అయితే బాబుకు మద్దతిచ్చేందుకు ఆ నాయకుడు ముందుకు వచ్చారు. బాబు గెలుపులో పాకాల సమితి కీలకంగా పనిచేసింది.

ప్రచారం తీరుపై బాబు సర్వే

ప్రచారం తీరుపై బాబు సర్వే

ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మిత్రుల ద్వారా ఓటర్ల మనోభావాలను తెలుసుకొనేందుకు చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా వ్యవహరించేవారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుండి స్పందన ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకొంటున్నారనే విషయాలపై బాబు స్నేహితులు ఇచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని జాగ్రత్తలు తీసుకొనే వారు.

తొలి ఎన్నికల్లో బాబు ఖర్చు రూ.89 వేలు

తొలి ఎన్నికల్లో బాబు ఖర్చు రూ.89 వేలు


1978లో చంద్రబాబునాయుడు చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు రూ.89వేలు ఖర్చు పెట్టారని అంచనా. మిత్రులకు భోజనాలు, వాహనాల ఖర్చులకు ఎక్కువగా ఖర్చయినట్టు అంచనా. ఈ డబ్బులో ఎక్కువ భాగం తండ్రి ఖర్జూరనాయుడు చెరుకు, బెల్లం విక్రయించి ఇచ్చిన డబ్బు. మిగిలిన సొమ్మును మిత్రులు సేకరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

English summary
chandrababu naidu first time elected as MLA in 1978 from Chandragiri Assembly segment.Pakala samiti key leaders supported to Chandrababu Naidu in this elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X