వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ని తప్పులా .. ఇన్ని జీవోల రద్దా ? అన్నీ తుగ్లక్ చర్యలే : జగన్ పై చంద్రబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ,మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతోందని నిప్పులు చెరిగిన చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఏడాదిలో జగమేత ఈ స్థాయిలో ఉంటే రాబోయే కాలంలో గజమేత ఇంకెలా ఉంటుందో ? అంటూ విమర్శించిన చంద్రబాబు ఈ దోపిడీని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తు నాశనం

ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తు నాశనం

ఒక్కసారి అని కాళ్లావేళ్లా పడి బతిమాలి అధికారంలోకి వచ్చిన వారు గత ప్రభుత్వాలతో పోటీపడి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ పాలకులు ఆ అవకాశాన్ని చేజేతులా కాల రాశారు. అవినీతి, అరాచకాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి,ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక అంతే కాదు తొలి ఏడాదిలోనే ఇన్ని తప్పులా ? ఇంత ప్రజా వ్యతిరేక పాలనా ? ఇన్ని జీవోల రద్దా? ప్రభుత్వం కోర్టులతో ఇన్ని చివాట్లు తినడం గతంలో ఎన్నడూ లేదు అని ఆయన పేర్కొన్నారు.

గతంలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్స్ జరిగాయా ?

గతంలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్స్ జరిగాయా ?

ఇక అభివృద్ధి లో అన్ని రంగాల్లో రివర్స్ లో ప్రయాణం చేస్తోంది ఏపీ అని విమర్శించారు. పేదల సంక్షేమం అంటే రద్దులు,కోతలు, నిధులు దారి మళ్లింపు, దుర్వినియోగం అని ఆయన వైసిపి ఏడాది పాలన పై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారని అన్నారు. గతంలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్స్ జరిగాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. నేరగాళ్ల పాలన అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి వైసీపీ అరాచకాలు రుజువు అని ఆయన పేర్కొన్నారు. మోసగాళ్లు అధికారంలోకొస్తే అన్ని మోసాలే, దగాకోరు రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు దగానే అంటూ చంద్రబాబు ఏపీలో ప్రస్తుత పాలనపై నిప్పులు చెరిగారు.

 90శాతం హామీలు నెరవేర్చారో 90శాతం మోసాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసు

90శాతం హామీలు నెరవేర్చారో 90శాతం మోసాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసు


90శాతం హామీలు నెరవేర్చారో 90శాతం మోసాలకు పాల్పడ్డారో ప్రజల్లోకి వెళ్లి అడిగితే చెబుతారు అంటూ పేర్కొన్నారు చంద్రబాబు. మూడు రాజధానులు బిల్లు, పీపీఏల రద్దు, బీసీల రిజర్వేషన్లు తగ్గింపు, కౌన్సిల్ రద్దు బిల్లు, ఎలక్షన్ కమిషనర్ తొలగింపు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, స్కీముల రద్దులు - పేర్లు మార్పు, జీవోల రద్దులు అన్ని తుగ్లక్ చర్య లేనని పేర్కొన్నారు. అనాలోచిత అహంభావ నిర్ణయాలేనని, చేతగాని పాలనా నిర్వాకాలే అని మండిపడ్డారు .

Recommended Video

TDP State President Post : Kinjarapu Rammohan Naidu Given Clarification
దారి తప్పిన ప్రభుత్వాన్ని చక్క దిద్దండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు

దారి తప్పిన ప్రభుత్వాన్ని చక్క దిద్దండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు

ఇలా రాష్ట్రం ఎప్పుడైనా నవ్వులపాలు అయిందా?అని ప్రశ్నించారు.పాలకుల అవినీతి, అసమర్థత రాష్ట్రానికి కీడు చేస్తుంటే అడ్డుకోవాల్సినది ప్రజలేనని చంద్రబాబు అన్నారు.ఇక అంతే కాదు వివిధ మాధ్యమాలద్వారా వైసిపి పాలనా లోపాలను ఎత్తి చూపడంద్వారా దారి తప్పిన ప్రభుత్వాన్ని చక్క దిద్దండి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ,అలాగే వైసీపీ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేసి మరీ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

English summary
ap former chief minister chandrababu naidu criticised ycp government's unpopularity in the state. TDP chief Chandrababu reacted on the Twitter platform of the one year's YCP rule is anarchy rule .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X