రిషికేశ్వరి తల్లిదండ్రులకు 10 లక్షల చెక్కు అందజేసిన చంద్రబాబు (ట్వీట్)
విజయవాడ: నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని మరణించిన బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యార్ధిని రిషికేశ్వరి తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు నాయుడు రూ. 10 లక్షల చెక్కుని మంగళవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Chief Minister hands over a Rs.10-lakh cheque to parents of Rishteshwari at Camp Office in Vijayawada. pic.twitter.com/mDTOQp3VLr
— Andhra Pradesh CM (@AndhraPradeshCM) August 11, 2015
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సిఎంను కోరామని చెప్పారు. గత నెలలో జరిగిన కేబినెట్ భేటీలో రిషికేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయంతో పాటు, రాజమండ్రిలో 500 గజాల స్ధలం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఈరోజు సీఎం వారికి ఆ చెక్కుని అందజేశారు. కాగా, నాగార్జునవర్సిటీ విద్యార్థిని రిషికేశ్వరి మృతి పైన విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ శనివారం చంద్రబాబును కలిసి మధ్యంతర నివేదకను అందించింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇటీవల రిషికేశ్వరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడ నుంచి పాలన ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా అక్కడే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు అధికారులు సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆర్థికశాఖపై సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు సాయంత్రం గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు.
వారం రోజుల పాటు ఆయన బెజవాడలోనే ఉంటారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని చీఫ్ సెక్రటరీ కార్యాలయంగా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు.
In a review meeting on finance, CM discussed about funds that the state is yet to get under various central schemes. pic.twitter.com/fPptuUKtiT
— Andhra Pradesh CM (@AndhraPradeshCM) August 11, 2015