వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకి ఏదో వీక్‌నెస్ పాయింట్ ఉంది.. అంత మెతకవైఖరి ఏంటి?: ఉండవల్లి అరుణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏదో వీక్ నెస్ పాయింట్ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు ఎందుకు పోరాడడం లేదని ఆయన నిలదీశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏదో వీక్ నెస్ పాయింట్ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నిధులపై అంత నిర్వేదం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పుడు మెతకగా ఉండడం వల్ల ఉపయోగం ఏముంటుందని ఉండవల్లి ప్రశ్నించారు.

undavalli-arunkumar

కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు ఎందుకు పోరాడడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు వీక్ నెస్ పాయింట్ ఏదో కేంద్రం వద్ద ఉన్నట్టు అనిపిస్తోందని, అందుకే బాబు పోలవరం పూర్తి చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

విభజన హామీలు నెరవేర్చమని అడగడం ఆంధ్రులుగా మన హక్కు, ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు పోరాడాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు.

ఆస్తులు అమ్మేసైనా పోలవరం పూర్తి చేస్తాం: జలీల్ ఖాన్

ఎమ్మెల్యేల ఆస్తులు అమ్మి అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలంతా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా జలీల్ ఖాన్ విజయవాడలో విభిన్నంగా స్పందించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబు లక్ష్యమని, చంద్రబాబు లక్ష్యసాధనకు పోరాడుతామని చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైతే జోలెపట్టి నిధులు సేకరిస్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

English summary
AP CM Chandrababu Naidu has some weakness point, said Ex-MP Undavalli Arun Kumar here in Rajamahendravaram on Thursday. Speaking on Polavaram project he passed comments like this. He asked why CM Chandrabau Naidu is not fighting with Central Government as AP State has it's right. On the other hand, Vijayawada MLA Jaleel Khan also passed some comments on this issue. He told that Polavaram Project is CM Chandrababu Naidu's target and to complete this project if it requires they will beg people for monedy and completes the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X