కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీకి నష్టం చేస్తే కఠిన చర్యలు, త్రిసభ్య కమిటీ: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలను హెచ్చరించారు.పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబునాయుడు హెచ్చించారు.

బిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనంబిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనం

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీలో చేర్చుకొనే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న విభేధాలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీనీ ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

'బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు''బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు'

ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జిల్లాలు, నియోజవకర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

బాబును చూస్తే భయం, అందుకే కక్షకట్టారు, సోము వీర్రాజెవరు?: జెసి సంచలనంబాబును చూస్తే భయం, అందుకే కక్షకట్టారు, సోము వీర్రాజెవరు?: జెసి సంచలనం

కర్నూల్ జిల్లాకు చెందిన నేతలతో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి అమరావతిలో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై బాబు సమీక్షించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని బాబు సూచించారు.

పార్టీ కోసం పనిచేయాలని బాబు సూచన

పార్టీ కోసం పనిచేయాలని బాబు సూచన


పార్టీ కోసం నేతల మధ్య ఉన్న విభేదాలను విడనాడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు.ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. పార్టీ అన్ని స్థానాల్లో గెలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.. విభేదాలు వీడి కలిసిక ట్టుగా పని చేయాలని కర్నూల్ జిల్లా నేతలకు సూచించారు. వ్యక్తులు కాదు ముఖ్యం.. పార్టీయే సుప్రీం. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహ రించాల్సి ఉంటుందని అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నాయకులను ఘాటుగా హెచ్చరించారు.

పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం త్రిసభ్య కమిటీ

పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం త్రిసభ్య కమిటీ


కర్నూలు, కోడుమూరు, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య విభేదాలపై ప్రధానంగా చర్చ సాగింది. కర్నూలులో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాల విషయమై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. నేతల మధ్య విభేధాల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.ఈ విషయమై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

చర్యలు తప్పవని బాబు హెచ్చరికలు

చర్యలు తప్పవని బాబు హెచ్చరికలు

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలను హెచ్చరించారు.నేతలు తమ మధ్య ఉన్న విభేధాలను విడనాడి పార్టీ కోసం పనిచేయాలని బాబు సూచించారు.మూడు నియోజకవర్గాల పరిధిలో రాజుకుంటున్న అంతర్గత విభేదాలు పార్టీపైనే కాకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయ వకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు.ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. సమర్థవంతంగా ఎదుర్కో వాలంటే విభేదాలు వీడి సమన్వయంతో కలిసి పని చేయాలి. మేం ఇలాగే ఉంటామంటే పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడబోనని బాబు హెచ్చరించారని సమాచారం.

బైరెడ్డిని పార్టీలో చేర్చుకొనే విషయం ఆలోచిస్తున్నాం

బైరెడ్డిని పార్టీలో చేర్చుకొనే విషయం ఆలోచిస్తున్నాం


బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టిడిపిలో చేర్చుకొనే విషయమై ఆలోచిస్తున్నామని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పార్టీ నాయకుడుఈ విషయమై బాబును ప్రశ్నించారు. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టిడిపిలో చేర్చుకొనే విషయమై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

English summary
Tdp chief Chandrababunaidu conducted the first meeting with Kurnool district TDP leaders at his residence at Undavalli on Monday. Party MLAs, MLCs and other leaders participated in the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X