వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాస తీర్మానం: 'జగన్ భయంతో, తీసుకున్న గోతిలో పడ్డ చంద్రబాబు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలికనే లేదని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అవిశ్వాస తీర్మానంతో టీడీపీ అసలు రంగు బయటపడిందన్నారు. చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సెంటిమెంటుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని చంద్రబాబు భయపడ్డారని విమర్శించారు.

Recommended Video

24న రాష్ట్రబంద్‌కు జగన్ పిలుపు

చంద్రబాబు వైసీపీ ట్రాప్‌లో పట్టారని విమర్శించారు. మమ్మల్ని ముంచే ఉద్దేశ్యంలో చంద్రబాబు కూడా మునుగుతున్నారన్నారు. తాము నిజాలు చెబుతామని ఎప్పటి నుంచో అంటున్నామని అన్నారు. ఏపీకి కేంద్రం చేసిన దానిని ప్రజలు గుర్తించారని చెప్పారు.

మీ వల్ల నష్టపోతున్నాం: పవన్‌కు రైతుల ఝలక్, జగన్‌లా చేయనని హామీమీ వల్ల నష్టపోతున్నాం: పవన్‌కు రైతుల ఝలక్, జగన్‌లా చేయనని హామీ

కేంద్రం డబ్బులిస్తే, చంద్రబాబు ప్రచారం

కేంద్రం డబ్బులిస్తే, చంద్రబాబు ప్రచారం

అంతకుముందు రోజు విజయవాడలో ఐవీ ప్యాలెస్‌లో జరిగిన బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నిధులిస్తుంటే, ఆ డబ్బుతో చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని కన్నా అన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదు

చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదు

గృహ నిర్మాణంలోనూ గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారని కన్నా ఆరోపించారు. మోడీని ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ మైనార్టీలు, బలహీనవర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పలేదన్నారు. ప్యాకేజీ కింద చంద్రబాబు రూ.5వేల కోట్లు కోరితే మోడీ రూ.16,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు.

వైసీపీకి బంద్ అర్హత లేదు

వైసీపీకి బంద్ అర్హత లేదు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం బంద్‌కు పిలుపునివ్వడం అవివేకమైన చర్య అని మంత్రి నారాయణ సోమవారం విమర్శించారు. పోరాడాల్సిన పార్లమెంటులో రాజీనామాలు చేసి పారిపోయారన్నారు. అలాంటి వారికి బంద్ చేసే అర్హత లేదన్నారు.

టీడీపీ నైతిక విజయం

టీడీపీ నైతిక విజయం

మన రాష్ట్రంలో మనం బంద్ చేసుకుంటే మనకే నష్టమని నారాయణ చెప్పారు. అవిశ్వాసం వీగిపోయినా తెలుగుదేశం పార్టీ నైతిక విజయం సాధించిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు రాష్ట్రంలో తిరిగే అర్హత లేదన్నారు.

English summary
BJP state president Kanna Laxminarayana came down heavily on Chief Minister N Chandrababu Naidu for indulging in malicious campaign against BJP over granting of funds for development of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X