• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా ... దేశంలో బీజేపీ గెలిస్తే చీకటే .. ఓ టీవీ షో లో కేఏపాల్ హంగామా

|
  Ap Assembly Election 2019 : చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా : కేఏపాల్ || Oneindia Telugu

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో హంగామా సృష్టించారు . చంద్రబాబు, జగన్ , పవన్ కళ్యాణ్ వారు వీరు అని లేకుండా అందరి మీద తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యాంకర్ పై పలుమార్లు ఆగ్రహం ప్రదర్శించిన పాల్ అసలు ఈ ఇంటర్వ్యూకి నేనెందుకు వచ్చాను అంటూ యాంకర్ ని ప్రశ్నించారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని వచ్చాను అని చెప్పిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. మళ్లీ మోదీ నాయకత్వం రాకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పిన కేఏ పాల్ ఓ దశలో నియంత్రణ కోల్పోయి ఆవేశపడ్డారు .

  వ్యవస్థలను మేనేజ్ చెయ్యటంలో చంద్రబాబు ఘనుడు .. అందుకే స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన అన్న వైసీపీ నేతలు

   నా ముందు వీళ్ళంతా బచ్చాలే అని పాల్ ఫైర్

  నా ముందు వీళ్ళంతా బచ్చాలే అని పాల్ ఫైర్

  "నేను చంద్రబాబు లాగా, జగన్ లాగా, కాంగ్రెస్ నేతల్లాగా లక్షల కోట్లు దోచుకోలేదు. నా సొంత సంపాదననే 37 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో డొనేట్ చేస్తున్నాను" అంటూ చెప్పిన కేఏ పాల్ ను , టీవీ యాంకర్ ఇన్ని చేస్తున్న మిమ్మల్ని ఈ రాష్ట్ర నాయకులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదు? అంటూ ప్రశ్నించారు . ఇక ఈ మాటతో తోక తొక్కిన కోతిలా చిందులేశారు కేఏ పాల్. ' చంద్రబాబు నాయడు నా ముందు బచ్చా, వీళ్లందరూ నా ముందు బచ్చాలే ' వాట్ ఆర్ యు టాకింగ్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.

  బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ లో అంధకారం

  బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ లో అంధకారం

  భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే భారత్ మ‌రింత అంధ‌కారంలోకి వెళ్తుందని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కే.ఏ.పాల్ అన్నారు. తాను ముఖ్య‌మంత్రిని కాలేక‌పోయినా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశంలో ప్ర‌జాస్వామ్యానికి, కోర్టు ఆదేశాల‌కు విలువ‌లేకుండా పోతుంద‌ని కే.ఏ.పాల్ అన్నారు. దేశం చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఉంద‌ని, ఒక ప్ర‌వ‌ర్త‌గా తాను ఈ విష‌యాన్ని ప్ర‌పంచానికి చెప్ప‌కుంటే ఆ పాపం త‌న‌ను వెంటాడుతుంద‌ని, అంద‌కే తాను ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పిన‌ట్టు కే.ఏ.పాల్ తెలిపారు.

  చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా... జగన్ ఓ క్రిమినల్..పవన్ లెక్కలో తీసుకోను ..పాల్

  చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా... జగన్ ఓ క్రిమినల్..పవన్ లెక్కలో తీసుకోను ..పాల్

  "చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా. జగన్ ఓ క్రిమినల్. పవన్ కళ్యాణ్ ను అయితే లెక్కలోకే తీసుకోను. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనంతా నేషనల్ లీడర్స్ తోనే రాజకీయాలు చేస్తాను, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ పెద్దనాయకులా? మీరు చెబుతున్న చంద్రబాబు, జగన్ పెద్ద నాయకులా?" అంటూ తనదైన స్టైల్ లో 'నేను ఒక్క నిమిషంలో కోటి రూపాయలు సంపాదించగలను, నా సమయం వృథా చేయొద్దని' యాంకర్ పై మండిపడ్డారు. మీరు వ్యక్తిగత ప్రశ్నలు అడగొచ్చు కానీ మేం ఎలాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడక్కూడదా? అంటూ మండిపడ్డారు . మీకు మరోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలా? వద్దా? అంటూ యాంకర్ నే తిరిగి ప్రశ్నించాడు . పాల్ టీవీ షో చూసిన వారంతా అవాక్కయ్యారంటే పాల్ ఎలా ప్రవర్తించి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు .

  English summary
  KA Paul has made sensational comments in a TV discussion on AP CM Chandrababu ,YCP cheif jagan and janasena cheif pavan .KA Paul has criticized chandrababu ,Jagan , Jagan has a criminal psychology and try to eliminate them if someone works against him. when anchor asked the question about nobody caring about K.A Paul why ? he shockingly fired and answered chandrababu is a small kid before me . I'm a politician who can do politics with national leaders ,not with the local parties leaders he said. He said that our nation may in danger zone if the BJP forms government again .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more