గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ దందాకు డాన్ చంద్రబాబే.. సీఎం అంటే దోచుకునేవాడా?: జగన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

'హ్యాపీ సిటీస్' ఈవెంట్ కోసం రూ.50కోట్లు ఖర్చు పెట్టడమేంటి : జగన్

ఉండవల్లి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి నిప్పులు చెరిగారు. రాజధాని కోసం లంక భూముల్ని, అసైన్డ్‌ భూముల్ని బలవంతంగా లాక్కునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.

ఏటా నాలుగు పంటలు పండే సారవంతమైన భూముల్ని రైతుల నుంచి లాక్కుని, ముష్టి వేసినట్టు వారికి 1000 గజాలు ఇస్తారా? అని నిలదీశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 134వ రోజు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సీబీఐ అస్త్రానికి కేంద్రం సిద్దం?: బాబులో అలజడి, కర్ణాటక ఎన్నికల తర్వాత జరగబోయేది అదే?సీబీఐ అస్త్రానికి కేంద్రం సిద్దం?: బాబులో అలజడి, కర్ణాటక ఎన్నికల తర్వాత జరగబోయేది అదే?

 కారుచౌకగా భూములను లాక్కున్నారు:

కారుచౌకగా భూములను లాక్కున్నారు:

అసైన్డ్‌ భూములు కోల్పోయిన దళితులు తన వద్దకు వచ్చి వారి గోడు వెల్లబోసుకుంటున్నట్టు జగన్ తెలిపారు. అసైన్డ్‌ భూములపై ప్రభుత్వ పెత్తనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. పైగా రాజధాని భూసేకరణలో.. అసైన్డ్ భూములకు ప్యాకేజీ రాదని నోటిఫై చేయించి మరీ తీసుకుంటున్నట్టుగా తనతో చెప్పారన్నారు.

మంత్రలు, టీడీపీ నాయకులు రైతులను బెదిరించి కారుచౌకగా భూములను కొనుగోలు చేసి.. ఆపై వాళ్లు మాత్రం ప్యాకేజీలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత రైతులు చెబుతుంటే.. ఈ విషయాలు విని బాధనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక దందాకి డాన్..:

ఇసుక దందాకి డాన్..:

పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం గ్రామాల్లో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని జగన్ ఆరోపించారు. వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తరలిస్తున్నారని, ఈ ఇసుక దందాకు డాన్ ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం చంద్రబాబే అని ఆరోపించారు. సీఎం అంటే ప్రజల ఆస్తులు కాపాడేవాడా? దోచుకునే వాడా? అంటూ రైతులు అడుగుతున్నారని పేర్కొన్నారు.

ఎందుకు రాజీనామా చేయించలేదు:

ఎందుకు రాజీనామా చేయించలేదు:

ఓవైపు కేంద్రం నిదులు ఇవ్వడం లేదు.. రాష్ట్రం వద్ద డబ్బు లేదని చెబుతూనే 'హ్యాపీ సిటీస్' ఈవెంట్ కోసం రూ.50కోట్లు ఖర్చు పెట్టడమేంటని జనం ప్రశ్నిస్తున్నట్టుగా జగన్ ప్రస్తావించారు.

ఇవాళ హోదా ఎండమావిగా తయారవ్వడానికి కారణం చంద్రబాబే అని మరోసారి ఆరోపించారు. చంద్రబాబు చిత్తశుద్ది ఉన్న పెద్ద మనిషి అయితే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి దీక్షకు కూర్చోబెట్టేవారని గుర్తుచేశారు.

సభలో అలజడి:

సభలో అలజడి:

జగన్ ఉండవల్లి సభలో ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది టీడీపీ నేతలు అలజడి రేపేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సుమారు 20 మందికిపైగా టీడీపీ యువకులు కోడిగుడ్లు, టమాటాలతో సభలో ప్రవేశించారని ఆరోపించారు. వారిని గుర్తించి పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది.

English summary
On Wednesday, in Undavalli public meeting YSRCP President Jaganmohan Reddy alleged that CM Chandrababu Naidu is the don of Sand Mafia in state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X