కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో జగన్‌కు చెక్-బాబుకు చిక్కులు: డిఎల్ డైలమా, సుధాకర్ అసంతృప్తి?

2019 ఎన్నికల్లో వైసిపి అధినేత వైయస్ జగన్‌కు సొంత ఇలాకాలోనే చుక్కలు చూపించేందుకు అధికార టిడిపి పావులు కదుపుతోంది. ఇప్పటికే కడప జిల్లా నుంచి పలువురు నేతలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు.

|
Google Oneindia TeluguNews

కడప: 2019 ఎన్నికల్లో వైసిపి అధినేత వైయస్ జగన్‌కు సొంత ఇలాకాలోనే చుక్కలు చూపించేందుకు అధికార టిడిపి పావులు కదుపుతోంది. ఇప్పటికే కడప జిల్లా నుంచి పలువురు నేతలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు.

చదవండి: బాబుకు షాకిస్తారా: పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాక.. జనసేనతో టచ్‌లో బోండా ఉమ?

కడప జిల్లాలో టిడిపి గెలిచింది ఒక్కటే సీటు

కడప జిల్లాలో టిడిపి గెలిచింది ఒక్కటే సీటు

2014 ఎన్నికల్లో కడప జిల్లాలో టిడిపి కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకకవర్గంలో మాత్రమే గెలిచింది. ఇప్పుడు 2019లో మాత్రం ఏకంగా సాధ్యమైతే పులివెందులలోనే జగన్‌ను ఓడించడం లేదా ఆయన మెజార్టీనా భారీగా తగ్గించడం చేయాలని చూస్తున్నారు.

ఈసారి కడపలో జగన్‌కు షాకిచ్చేందుకు

ఈసారి కడపలో జగన్‌కు షాకిచ్చేందుకు

కడప పార్లమెంటు స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకొని వైయస్ జగన్‌కు గట్టి షాకివ్వాలని టిడిపి భావిస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టిడిపిలో చేరారు. ఆదినారాయణను ఏకంగా మంత్రిని చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఓడించి కడపలో తన ఉనికిని నిరూపించుకొని జగన్‌కు భారీ షాకిచ్చింది.

టిక్కెట్‌పై పోటీ లేకుండా సుధాకర్ యాదవ్‌కు టిటిడి పదవి

టిక్కెట్‌పై పోటీ లేకుండా సుధాకర్ యాదవ్‌కు టిటిడి పదవి

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో సత్తా చాటాలని టిడిపి భావిస్తోంది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మైదుకురు టిడిపి ఇంచార్జ్ సుధాకర్ యాదవ్‌ను తప్పించి, డిఎల్ రవీంద్రా రెడ్డిని పార్టీలోకి తీసుకొని, ఆయనకు నియోజవకవర్గాన్ని అప్పగించాలని చూస్తోందని అంటున్నారు. ఇందుకోసం సుధాకర్ యాదవ్‌కు టిటిడి పదవి ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో పోటీ లేకుండా ఉండేందుకు బాబు ఇలా చేస్తున్నారని అంటున్నారు.

మైదుకూరులో ప్రతి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానిదే హవా

మైదుకూరులో ప్రతి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానిదే హవా

మైదుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికలను పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గానిదే గెలుపు. 2014లోనూ వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతిలో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఓటమి చవి చూశారు. గతంలోను డిఎల్ రవీంద్రా రెడ్డిదే హవా. ఆయన 1989, 1994, 2004, 2009లలో గెలిచారు.

అందుకే డిఎల్‌కు బాబు గాలం

అందుకే డిఎల్‌కు బాబు గాలం

దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన, నియోజకవర్గంలో పలుమార్లు గెలిచిన డిఎల్ రవీంద్రా రెడ్డికి టిక్కెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో టిడిపికి లాభిస్తుందని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే డీఎల్‌కు గాలం వేశారని అంటున్నారు.

సుధాకర్ యాదవ్ అసంతృప్తి

సుధాకర్ యాదవ్ అసంతృప్తి

మైదుకూరులో ఓడినప్పటికీ సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు మూడేళ్లుగా కృషి చేస్తున్నారు. 2019లో టిక్కెట్, గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం గెలుస్తుందనే ఉద్దేశ్యంతో తనను పక్కకు తప్పించడంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో భేటీ కానున్నారని అంటున్నారు. డీఎల్ కోసం తనను బలిపశువును చేస్తున్నారని వాపోతున్నారట. అదే సమయంలో మైదుకూరు నుంచి తప్పించినా టిటిడి చైర్మన్ వంటి మంచి పదవి వస్తుందని ఆయన వర్గంలోని కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

డిఎల్ రవీంద్రా రెడ్డి డైలమా

డిఎల్ రవీంద్రా రెడ్డి డైలమా

తాను టిడిపిలోకి వస్తే మైదుకూరు టిక్కెట్ తనకు ఇచ్చేందుకు సుధాకర్‌ను టిటిడి చైర్మన్‌గా పంపిస్తారని తెలిసినప్పటికీ.. డీఎల్ రవీంద్రా రెడ్డి పచ్చ కండువా కప్పునే విషయంలో డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే టిడిపిలోకి వెళ్తానంటే తొందరపాటు అవుతుందని, వేచి చూద్దామనే ధోరణిలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.

English summary
Telugu Desam Party chief Nara Chandrababu Naidu keen on Kadapa district. It is said that DL Ravindra Reddy may join TDP and will contest from Mydukur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X