వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను వైయస్ ఏపీలో అడుగు పెట్టనివ్వలేదు, హడావుడి చేశారు: బాబు షాకింగ్

వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు జగన్‌ను ఏపీలోకే అడుగు పెట్టనివ్వలేదని, తనకు మన్మోహన్ సర్కార్ ఎస్పీజీ భద్రత కల్పిస్తే ఉండేందుకు వైయస్ స్థలం కేటాయించలేదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు జగన్‌ను ఏపీలోకే అడుగు పెట్టనివ్వలేదని, తనకు మన్మోహన్ సర్కార్ ఎస్పీజీ భద్రత కల్పిస్తే ఉండేందుకు వైయస్ స్థలం కేటాయించలేదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నంద్యాలలో గెలుస్తాం కానీ, వైసిపికి గబ్బు, జగన్‌తో మోడీ కలవరు: జెసినంద్యాలలో గెలుస్తాం కానీ, వైసిపికి గబ్బు, జగన్‌తో మోడీ కలవరు: జెసి

ఆయన మంగళవారం పలు అంశాలపై మాట్లాడారు. జగన్, ఐవైఆర్ కృష్ణా రావు, నియోజకవర్గాల పెంపు, వెంకయ్య నాయుడు, జిఎస్టీ, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలపై మాట్లాడారు.

జగన్‌ను వైయస్ ఏపీకే రానివ్వలేదు

జగన్‌ను వైయస్ ఏపీకే రానివ్వలేదు

జగన్ స్వభావం ఏమిటో ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. అంకితభావంతో ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ఇప్పుడు లేవన్నారు. ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ను ఏపీకే రానివ్వలేదని, స్వయంగా ఈ విషయాన్ని రోశయ్యే చెప్పారన్నారు. అందరికీ కోపం ఉంటుందని, కానీ అదుపులో ఉంచుకోవాలని చెప్పారు.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
ఆ విషయాలు బయటకొస్తాయని నాడు వైయస్ హడావుడి

ఆ విషయాలు బయటకొస్తాయని నాడు వైయస్ హడావుడి

వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరుడు గంగిరెడ్డికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఆ విషయాలు బయటకు వస్తాయని వైయస్ అప్పుడు హడావుడి చేశారన్నారు. అలిపిరి ఘటనపై వైయస్ నిరసన తెలిపారని అంతా భావిస్తున్నారన్నారు. తనకు మన్మోహన్ సర్కార్ ఎస్పీజి భద్రత కల్పిస్తామంటే వారికి వైయస్ స్థలాలు ఇవ్వలేదని ఆరోపించారు.

వెంకయ్య పరపతి మనకు ఉపయోగపడుతుంది

వెంకయ్య పరపతి మనకు ఉపయోగపడుతుంది

కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు మనకు వీలైనంత సాయం చేశారని చంద్రబాబు చెప్పారు. ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనా ఆయన పరపతి మనకు ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సి ఉందన్నారు.

ఐవైఆర్ కృష్ణా రావు అప్పుడే ఎందుకు చెప్పలేదు

ఐవైఆర్ కృష్ణా రావు అప్పుడే ఎందుకు చెప్పలేదు

ఐవైఆర్ కృష్ణా రావు ఉన్నప్పుడే సీఎం పేషీ గురించి ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన బయటకు వెళ్లిపోయాక లోపాలు కనిపిస్తున్నాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. జిఎస్టీతో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. అనుకున్న సమయంలో పురుషోత్తమపట్నం పూర్తి చేస్తామన్నారు. ఏపీలో ల్యాండ్ పూలింగ్ విజయవంతమైందన్నారు. 12.5 హెక్టార్ల అటవీ శాఖ భూమిని కేంద్రాన్ని అడిగామని చెప్పారు.

అమరావతిలో మీడియా సంస్థలకు స్థలాలు, జర్నలిస్టులకు ఇళ్లు

అమరావతిలో మీడియా సంస్థలకు స్థలాలు, జర్నలిస్టులకు ఇళ్లు

ఏపీ రాజధాని అమరావతిలో మీడియా సంస్థలకు స్థలాలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. జర్నలిస్టులకు మూడు గదుల ప్లాట్లు ఇస్తామన్నారు. మూడు నెలల్లో పోలవరం ప్రాజెక్టుకు ఓ రూపు వస్తుందన్నారు.

ఎక్కువ నియోజకవర్గాలు ఉండాలి కానీ కేంద్రం నాకేం చెప్పలేదు

ఎక్కువ నియోజకవర్గాలు ఉండాలి కానీ కేంద్రం నాకేం చెప్పలేదు

ఎక్కువ నియోజకవర్గాలు ఉంటేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గాల పెంపుపై కేంద్రం అధికారికంగా తనకు ఏమీ చెప్పలేదన్నారు. నియోజకవర్గాల పెంపు లేకున్నప్పటికీ ఇబ్బంది లేదని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu on Tuesday lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy and late Chief Minister YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X