అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవయవదానం చేస్తాను: బాబు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే షరతు ఆలోచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవయవ దానంకు ముందుకు వచ్చారు. ఆర్గాన్ డొనేషన్‌కు తాను సిద్ధమని ప్రకటిచారు. అంతేకాదు అవయవ దానం అంశాన్ని పాఠ్యాంశంలో పెడతామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో అవయవ దానాన్ని ఓ షరతుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని కీలక ప్రకటన చేశారు.

అమరావతి ప్రజావేదిక హాలులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నా అవయవాలను నేను దానం చేసేందుకు ముందుకు వస్తున్నానని, ఆర్గాన్ డొనేషన్ పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని, జీవన్ మిత్ర పేరుతో పెద్ద ఎత్తున సాధికార మిత్రలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

Chandrababu Naidu making the decision to donate, 1.2 Lakh persons to donate organs in AP

లక్షా ఇరవై వేల మంది అవయవదానంకు ముందుకు వచ్చారని చంద్రబాబు అన్నారు. అవయవదాతలు ఇంత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఇదే తొలిసారి అన్నారు. మెప్మాలో పని చేసేవారి ఆదాయాన్ని రూ.10వేలకు మించేలా ప్రయత్నిస్తామని చెప్పారు.

కాగా, చంద్రబాబు పది రోజుల క్రితం అవయవదానం కోసం పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో స్వచ్చందంగా లక్షా ఇరవై వేల మంది అవయవ దానంకు ముందుకు వచ్చారు. వారికి ఇచ్చిన పత్రాలను చంద్రబాబు సమక్షంలో జీవన్‌దాన్‌ సంస్థకు మెప్మా అందించింది.
ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్‌లోకి ఈ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. తన పిలుపునకు స్పందించి ఇంతమంది ముందుకు రావడంపై ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

English summary
One lakh twenty thousand donors expressed willingness to donate organs on Monday in Andhra Pradesh on the occasion of International Organ and Tissue Donation Awareness Week, announced Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X