వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనవడితో పండగ జరుపుకోకుండా వచ్చా: అమెరికాలో చంద్రబాబు

తాను ఇంటిదగ్గర తన మనవడితో దీపావళి చేసుకోకుండా... ప్రజల కోసం ఇక్కడికి వచ్చానని, ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన మీరు తనతో గడపడానికి ఇక్కడకు వచ్చారని అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నా

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తాను ఇంటిదగ్గర తన మనవడితో దీపావళి చేసుకోకుండా... ప్రజల కోసం ఇక్కడికి వచ్చానని, ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన మీరు తనతో గడపడానికి ఇక్కడకు వచ్చారని అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రావరం డెమోయిన్స్ టీడీపీ ఫోరం సమావేశంలో ఎన్నారైలతో భేటీ అయ్యారు చంద్రబాబునాయుడు.

తాను చేసిన చిరు ప్రయత్నమేనంటూ..

తాను చేసిన చిరు ప్రయత్నమేనంటూ..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను గతంలో చేసిన చిరు ప్రయత్నం వల్ల మీరంతా ఇక్కడికి వచ్చారన్నారు. ఆనాడు 30 ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్యను 300కు పెంచానని, దాంతో అందరూ ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్నారని బాబు పేర్కొన్నారు. మీరు మంచి స్థాయిలో ఉన్నారు.. పుట్టిన నేలను, జన్మభూమిని మరవొద్దని చంద్రబాబు సూచించారు. మీ అందర్నీ పైకి తెచ్చిన ఈ నేలను కూడా మరచిపోవద్దు' అని బాబు కోరారు.

ఇంకా ఎదగాలి..

ఇంకా ఎదగాలి..

ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తి పడకండి... వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగండని చంద్రబాబు సూచించారు. కొంతమంది ఇప్పటికే ఆ స్థాయికి ఎదిగారు.. కానీ ఇది చాలదు, ఇంకా కావాలన్నారు. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, అదే సమయంలో మన రాష్ట్రం కోసం నెట్‌వర్క్ చేయండని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పయనీర్ బృందంతో భేటీ..

పయనీర్ బృందంతో భేటీ..

ఇది ఇలా ఉండగా, అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం రెండో రోజు పయనీర్‌ పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది. పయనీర్‌ ఆవిష్కరణల కేంద్రానికి చేరుకుని కార్యకలాపాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. తమ ప్రాజెక్టులపై సీఎం బృందానికి పయనీర్‌ గ్లోబల్‌ ఉపాధ్యక్షుడు బ్రాడ్‌ లాన్స్‌ వివరించారు.

రాత్రి కూడా భేటీలే..

రాత్రి కూడా భేటీలే..

గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్త్రతంగా పని చేసినట్లు పయనీర్‌ శాస్త్రవేత్తలు చెప్పారు. మొక్కల జన్యు అభివృద్ధి, సరఫరాదారుగా పయనీర్‌కు పేరొంది. అనంతరం రాత్రి 10.30గంటలకు అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విత్తన, వ్యవసాయ సంస్థల సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday met NRI's in his america tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X