వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ట్రైలరే భయంకరం..నవరత్నాల బదులు నవరత్న తైలంతో : వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు, లోకేష్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. కానీ ఇదే సమయంలో వైసీపీ పాలనపై ప్రతిపక్ష పార్టీలు మాత్రం నిప్పులు చెరుగుతున్నాయి. వైసిపి సంవత్సర పాలన విధ్వంసకర పాలన, అరాచక పాలన అని, ప్రజా వ్యతిరేక పాలన అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాం మాధవ్.. బీజేపీ రాష్ట్ర నాయకులకు షాక్వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాం మాధవ్.. బీజేపీ రాష్ట్ర నాయకులకు షాక్

 కూల్చివేతలతో ప్రారంభించిన ఘన చరిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది :చంద్రబాబు

కూల్చివేతలతో ప్రారంభించిన ఘన చరిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది :చంద్రబాబు

ఇక జగన్ ఏడాది పాలనలో రాష్ట్రానికి జరికిన ప్రయోజనం ఏమీ లేదంటూ ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు మాజీ మంత్రి లోకేష్ ఏడాది వైసిపి పాలనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాలన ఆరంభంలోనే కూల్చివేతలతో ప్రారంభించిన ఘన చరిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అని ఇక వైసీపీ పాలనలో అంతకంటే ఏం ఆశించగలం అంటూ ఆయన ప్రజావేదిక కూల్చివేత కు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ఇక అంతే కాదు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్నారని, ఇది దేశ చరిత్రలోనే జరగలేదని రాజధాని అమరావతి రైతుల పోరాటానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ట్రైలర్ ఈ విధంగా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో హతవిధీ

ట్రైలర్ ఈ విధంగా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో హతవిధీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను ఎంతగా మోసపోయారో చెబుతున్న వీడియో ఇది అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం . ట్రైలర్ చూస్తేనే ఈ విధంగా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో హతవిధీ అంటూ వన్ ఇయర్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు వైసిపి ఏడాది పాలన పై స్పందించారు.

 హామీల వర్షం కురిపించారు.. షరతులు వర్తిస్తాయన్నారు : లోకేష్

హామీల వర్షం కురిపించారు.. షరతులు వర్తిస్తాయన్నారు : లోకేష్

ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వైసిపి ఏడాది పాలన పై వరుస ట్వీట్లు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. వన్ ఇయర్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటూ పలు వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోల ద్వారా జగన్ పాలన ఎలా ఉందో చూపించారు. నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు అంటూ నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. "ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్ గారు గెలిచిన తరువాత 'షరతులు వర్తిస్తాయి' అంటూ మొహం చాటేశారని మండిపడ్డారు.

Recommended Video

AP Govt Extends Build AP E-auction For 15 Days
ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు

ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు

నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు అంటూ ఎద్దేవా చేశారు. ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.ఇక అంతే కాదు వైసిపి ఒక సంవత్సరం పాలనలో ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందని సీఎం జగన్ ఇచ్చిన అబద్ధపు హామీలను గురించి వీడియో షేర్ చేశారు . అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశారని, పేదవాడి కడుపు పై తన్నారని పేర్కొన్నారు. నడిరోడ్డు మీద గోడలు కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డికి ఓటేస్తే దేశాన్ని అమ్మేస్తాడు అని ఎన్నికలకు ముందే ఒక బామ్మ చెప్పిందని ఆమె వీడియోను పోస్ట్ చేసి ఇప్పుడు అదే జరుగుతుందన్నారు నారా లోకేష్.

English summary
AP Opposition Party Telugu Desam Party has been severely criticized for ycp government's unpopularity in the state. TDP chief Chandrababu and his son, former minister Lokesh, reacted on the Twitter platform of the one year's YCP rule. they tweeted that under a hash tag 1 year of mass destruction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X