విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ డీసీఐ అంశంపై స్పందించిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. డీసీఐ సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

డీసీఐ ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఉద్యోగులు విశాఖలో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మద్దతు ప్రకటించి.. ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి మోడీకి లేఖకూడా రాశారు.

 chandrababu naidu on DCI issue

పోలవరానికి కేంద్ర బృందం

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం దిల్లీ నుంచి గురువారం రాజమహేంద్రవరం చేరుకుంది. ఓ హోటల్లో బస చేసిన కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మ్యాప్‌లను పరిశీలించారు.

రాజమహేంద్రవరం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి పోలవరం చేరుకుని కాపర్‌ డ్యాంతో పాటు ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. వైకే చౌబే, ఆర్‌సీ శర్మ, శంకదీప్‌ చౌదరి ఈ బృందంలో ఉన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu responded on dredging corporation of india issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X