వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటలు రుద్దితే ఎలా: అసెంబ్లీలో బాబు ఆగ్రహం, 'నారాయణ, చైతన్యలకు భారీ ఫైన్'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ అసెంబ్లీలో బుధవారం విద్యార్థుల ఆత్మహత్య అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు ఎంతో బాధాకరం అన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

మరో వికెట్, జగన్‌కు గుర్నాథ్‌రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీమరో వికెట్, జగన్‌కు గుర్నాథ్‌రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీ

Recommended Video

Narayana Junior College Again in Trouble

మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకుంటున్నారని వాపోయారు. విద్యార్థులను 24 గంటలు రుద్దితే ఫలితాలు రావని చెప్పారు. వారిలోని సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు బోధనలో కొత్త పద్ధతులను అనుసరించాలని సూచించారు.

 ర్యాంకుల కోసం ఒత్తిడి వద్దు

ర్యాంకుల కోసం ఒత్తిడి వద్దు

ర్యాంకుల కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకు రావొద్దని చంద్రబాబు చెప్పారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు వస్తే కలవనీయక పోవడం దారుణం అన్నారు. స్కూల్ దశ తర్వాత విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. విద్యార్థులను యంత్రాలుగా మార్చడం సరికాదన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ నాయకులు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు.

కార్పోరేట్ కాలేజీలు మినీ జైళ్లుగా మారాయి

కార్పోరేట్ కాలేజీలు మినీ జైళ్లుగా మారాయి

కార్పోరేట్ కాలేజీలు మినీ జైళ్లుగా మారాయని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. పిల్లలకు ఆరు గంటలకు మించి నిద్ర ఉండటం లేదని వాపోయారు. అవసరమైతే కోర్సును కుదించాలన్నారు.

 విద్యార్థులపై ఒత్తిడి వాస్తవమే

విద్యార్థులపై ఒత్తిడి వాస్తవమే

కొన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులపై ఒత్తిడి ఉన్నది వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే జరిమానా వేశామన్నారు. వచ్చే ఏడాది నాటికి అన్ని విద్యాసంస్థల్లో నిబంధనలు పాటించేలా చూస్తామన్నారు.

 నారాయణ, చైతన్యలకు రూ.50 లక్షల చొప్పున జరిమానా

నారాయణ, చైతన్యలకు రూ.50 లక్షల చొప్పున జరిమానా

నిబంధనలు పాటించని పలు జిల్లాల్లోని నారాయణ, చైతన్య కాలేజీలకు రూ.50 లక్షల చొప్పున జరిమానా విధించామని, చర్యలు తీసుకుంటామని గంటా చెప్పారు. ప్రయివేటు కళాశాలల్లో ఆత్మహత్యల నివారణకు రెండు కమిటీలు వేసినట్లు చెప్పారు. రోజుకు 18 గంటల పాటు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆత్మహత్య నివారణకు సీఎం స్వయంగా యాజమాన్యాలతో చర్చించారన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on students suicid in Andhra Pradesh Assembly on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X