కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటే, ప్రొద్దుటూరు ఘటనపై నివేదిక కోరిన బాబు

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకొన్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకొన్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య పద్దతిలో ఈ ఎన్నికలు జరగాలి, కానీ, హింసాత్మక పద్దతిలో ఎన్నికలు జరగాలనుకోవడం సరైందికాదన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఘటనలకు చోటులేదన్నారు చంద్రబాబునాయుడు.

Chandrababu Naidu ordered to party president to submit report

పార్టీలన్నీ సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయమై నివేదికను సమర్పించాలని పార్టీ అధ్యక్షుడిని బాబు ఆదేశించారు.

అయితే రెండురోజులుగా ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక విషయమై టిడిపిలో రెండు వర్గాల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో రెండు వర్గాలు మున్సిఫల్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ రెండు వర్గాలు కూడ మెట్టు దిగని కారణంగా గొడవలు సాగుతున్నాయి.

English summary
Chandrababu Naidu ordered to party president to submit report on Proddatur Municipal chairman elections issue.This is not correct in democracy system Babu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X