వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడా తగ్గొద్దు, కుట్రలతో జాగ్రత్త!, అంతా గమనిస్తా: టీడీపీ ఎంపీలకు తేల్చేసిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం

అమరావతి: పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని వ్యాఖ్యానించారు.

వెనుకడుగు వేయొద్దు..

వెనుకడుగు వేయొద్దు..

సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని చెప్పారు.

ఎప్పటికప్పుడు గమనిస్తుంటా..

ఎప్పటికప్పుడు గమనిస్తుంటా..

తాను ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని, ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు కూడగట్టాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్టీ ఎంపీలతో బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఉపదేశించారు.

పార్లమెంటులో క్వశ్చన్ అవర్: విపక్షాల ఆందోళన, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నానిపార్లమెంటులో క్వశ్చన్ అవర్: విపక్షాల ఆందోళన, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని

దోషులుగా నిలబెట్టాలి

దోషులుగా నిలబెట్టాలి

కాగా, అఖిలపక్షం భేటీలో చర్చల సారాంశాన్ని ఎంపీలు సీఎంకు వివరించారు. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లితో జరిపిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. అన్యాయం చక్కదిద్దుతామని చెప్పిన బీజేపీ, ఇప్పుడు అన్యాయం చేయటం మోసమేనని చంద్రబాబు అన్నారు. ప్రజాకోర్టులో వారిని దోషులుగా నిలబెట్టాలని... ఏ పార్టీలు మద్దతిస్తాయో ప్రజలే చూస్తారన్నారు.

వైసీపీ ఎంపీల నాటకాలు.. కుట్రలతో అప్రమత్తం

వైసీపీ ఎంపీల నాటకాలు.. కుట్రలతో అప్రమత్తం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి, ఇప్పుడు పోరాడుతున్నట్లు నటిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పలాయన వాదానికి ఇదే నిదర్శనమని అన్నారు. వాళ్ల రాజీనామాలను ప్రజలు పట్టించుకోకపోవడంతో... సభలో వారి గొంతు లేకుండా పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రత్యర్థుల కుట్రల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఉపదేశించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Wednesday morning ordered TDP MPs that to protest parliament for state rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X