కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఓర్వలేకపోతున్నారు': చంద్రబాబుతో కర్నూలు జిల్లా టీడీపీ నేతల భేటీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీలో అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన గుంటూరు జి్లాల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కాటూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 40 మంది సర్పంచ్‌లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కష్టాలు శాశ్వతం కాదని, కష్టపడి పనిచేస్తే మంచిరోజులు వస్తాయని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అన్యాయం చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొచ్చారని కొనియాడారు.

రంగంలోకి వైఎస్ విజయమ్మ, సీన్ రివర్స్: జగన్ పార్టీలోనే భూమా నాగిరెడ్డి

రాష్ట్రాభివృద్ధిని చూసి కాంగ్రెస్, వైసీపీలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రపంచంలో రెండే కులాలున్నాయని చెప్పారు. ఒకటి డబ్బున్నోళ్లు, రెండోది డబ్బులేని వాళ్లు. కులాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Chandrababu naidu over tdp joinings in andhra pradesh

కులాలు, మతాలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి లాభపడాలని చూస్తున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతురుణమాఫీ చేశామని అన్నారు. ప్రతిపక్షాలు నదుల అనుసంధానంపై విమర్శుల చేస్తున్నాయని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

భూమాపై ఆశలు వదులుకున్న జగన్: తీవ్రమైన వ్యాఖ్య

తెలుగుదేశంలోకి చేరిన 40మంది సర్పంచ్‌లకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

చంద్రబాబుతో కర్నూలు జిల్లా టీడీపీ నేతల భేటీ

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చిన పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

English summary
Andhra Pradesh cheif minister Chandrababu naidu over tdp joinings in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X