వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్: రాజ్యసభ ఎన్నికలే టార్గెట్, పాదయాత్రపై బాబు ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు షాకిచ్చేలా టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహరచన చేస్తున్నారు..జగన్ పాదయాత్ర నిర్వహించే జిల్లాల నుండే వలసలను ప్రోత్సహించేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.రానున్న రోజుల్లో వైసీపీ నుండి ఇంకా పెద్ద సంఖ్యలో వలసలు ఉండే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అభిప్రాపడుతున్నాయి.

రంగంలోకి అనిల్: వ్యూహం మార్చిన జగన్, వైసీపీ తాజా ప్లాన్ ఇదే!రంగంలోకి అనిల్: వ్యూహం మార్చిన జగన్, వైసీపీ తాజా ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మేరకు పాదయాత్రను జగన్ లక్ష్యంగా ఎంచుకొన్నారు. నవంబర్ 2వ, తేది నుండి జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు.

జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?

కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని వైసీపీ చీఫ్ జగన్ ప్లాన్ చేశారు. పాదయాత్ర ఏర్పాట్లపై జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

వైఎస్ జగన్‌కు బాబు చెక్

వైఎస్ జగన్‌కు బాబు చెక్

నవంబర్ రెండవ తేది నుండి వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే పాదయాత్ర సుదీర్ఘంగా నిర్వహించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ జగన్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అయితే అదే సమయంలో జగన్‌కు వ్యూహనికి చెక్ పెట్టేలా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జగన్ ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తారో.. అదే జిల్లా నుండి వైసీపీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులను టిడిపిలో చేరేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోందని తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో జగన్‌కు షాకిస్తారా?

రాజ్యసభ ఎన్నికల్లో జగన్‌కు షాకిస్తారా?

2018 మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర శాసనసభలో తమ పార్టీకి ఉన్న బలం ఆధారంగా ఒక్క సీటును గెలుచుకొనే అవకాశం వైసీపీకి ఉంది. అయితే ఆ ఒక్క సీటును కూడ గెలుచుకోకుండా ఉండేలా టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకొనేలా టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

పాదయాత్ర ప్రారంభమైన 6 రోజులకే అసెంబ్లీ

పాదయాత్ర ప్రారంభమైన 6 రోజులకే అసెంబ్లీ


ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించిన ఆరురోజులకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హజరుకాకపోవచ్చు. పాదయాత్ర సాగుతున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడ పాదయాత్రలో ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాబు పాల్గొనలేదు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా

ఎన్నికలు ఎప్పుడొచ్చినా


నిర్ణీత సమయానికి కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడ సానుకూలంగా ఉన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ చీఫ్ జగన్ కూడ తమ పార్టీ నేతలకు ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ముందస్తు ఎన్నికలు జరిగితే తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

English summary
Ap chief minister Chandrababu naidu planning to win all Rajya Sabha seats from Ap state. Rajya sabha elections may conduct in 2018 March.As per MLA's strenth Ysrcp will win one Rajyasabha seat from Ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X