వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు సభ్యత ఉందంటూ.. జశోదాబెన్‌ను లాగి మోడీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనను నిరసిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నల్ల చొక్కా ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిపై ఆయన ద్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి రేటు కంటే ఏపీ అభివృద్ధి రేటు ఎక్కువ అన్నారు. మోడీ రాకను నిరసిస్తూ తాను నల్ల చొక్కా ధరించి వచ్చానని చెప్పారు.

తాము 90 శాతం మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని మోడీ చెబుతున్నారని, అది వాస్తవమే కానీ, తాను సమైక్య ఏపీలోనే 33 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చానని చెప్పారు. తిట్టడం సులభమని, పనులు చేయడం మాత్రం చాలా కష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారని విభజన సమయంలో మోడీ చెప్పారని, ఇప్పుడు తల్లిని కూడా చంపేశారన్నారు.

చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లుచంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లు

 కావాల్సిన వ్యక్తులకు దోచిపెడుతున్నారు

కావాల్సిన వ్యక్తులకు దోచిపెడుతున్నారు

మోడీ తమకు కావాల్సిన వ్యక్తులకు దోచి పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. మోడీ మహాకూటమి అంటూ విమర్శలు చేస్తున్నారని, కానీ బీజేపీ తీరుపై అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయని, మోడీ ఇంటికి పోవడం ఖాయమని చెప్పారు. తాను మోడీని తిట్టేందుకు కూటమిలో చేరలేదని, ఏపీకి అన్యాయం జరిగిందని చేరానని చెప్పారు. తమ మనోభావాలు దెబ్బతీశారన్నారు. తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టించారని విపక్షాలం కలిశామన్నారు.

 మోడీవి వ్యక్తిగత ప్రయోజనాలు

మోడీవి వ్యక్తిగత ప్రయోజనాలు

విభజన గాయానని ప్రధాని నరేంద్ర మోడీ పెద్దదిగా చేశారని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని నాడు బీజేపీ డిమాండ్ చేసిందని, ఇప్పుడు అదే బీజేపీ మాట తప్పిందన్నారు. మట్టి, నీళ్లు మొహం మీద కొట్టి అన్యాయం చేశారన్నారు. మోడీవి వ్యక్తిగత ప్రయోజనాలు అని, తమ ఆలోచనలు ప్రజల కోసం అన్నారు. మీరు అసూయపడేలా అమరావతిని కట్టి తీరుతామని చెప్పారు. రైతులకు ఉన్న స్ఫూర్తి కూడా కేంద్రానికి లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేశారన్నారు.

ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారు

ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారు

గుజరాత్‌లో ముస్లీంల ఊచకోత జరిగితే మోడీ రాజీనామాకు తాను డిమాండ్ చేశానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అమలు చేస్తోందన్నారు. ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తోందన్నారు. బీజేపీకి జనం లేరు కనుక ప్రధాని మోడీ సభకు వైసీపీ జనాన్ని సమీకరించిందని చెప్పారు. మీరు సహకరించకపోయినా, మీరు ఏపీ హక్కులు కాలరాసినా మేం అన్నింటా ముందంజలో ఉన్నామని నేను ప్రధాని మోడీకి చెబుతున్నానని అన్నారు.

 నోట్ల రద్దు పిచ్చితుగ్లక్ పని

నోట్ల రద్దు పిచ్చితుగ్లక్ పని

మన గడ్డపై మనకే మోడీ అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన మాటల మనిషి తప్ప, చేతలు లేవన్నారు. నోట్ల రద్దు పిచ్చితుగ్లక్ పని అన్నారు. నోట్ల రద్దుతో జనం ఇబ్బంది పడ్డారని చెప్పారు. కొందరు దోచుకొని విదేశాలకు పారిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. రాఫెల్ వ్యవహారంలో సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఓ ప్రయివేటు వ్యక్తికి యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇప్పించారన్నారు. మోడీ కాపలాదారు కాదని, దగాకోరు అన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించారని చెప్పారు. నాది యూటరన్ కాదని, రైట్ టర్న్ అన్నారు. మాట తప్పిన మోడీ ప్రభుత్వానిదే యూటర్న్ అన్నారు.

అమరావతిని చూసి మోడీ అసూయపడుతున్నారు

అమరావతిని చూసి మోడీ అసూయపడుతున్నారు

అమరావతిని చూసి మోడీ అసూయపడుతున్నట్లుగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఓ వైపుకు అమరావతికి అవార్డులు ఇస్తూనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం దగా చేసినా రాత్రింబవళ్లు కష్టపడి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నాడు తెలుగు జాతి కోసం తాను హైటెక్ సిటీ కట్టానని, ఔటర్ రింగ్ రోడ్డు వేశానని చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు అగ్ర రాజధానుల్లో అమరావతిని చేసేలా కృషి చేస్తానని చెప్పారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా గులాంగిరీ చేస్తున్నారన్నారు. నేను వైసీపీ ఉచ్చులో పడలేదని చంద్రబాబు చెప్పారు. జగన్ ఉచ్చులో పడిందని మోడీ అన్నారు. అవినీతిపరులను పెంచి పోషిస్తున్నారని చెప్పారు.

ప్రధాని మోడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ప్రధాని మోడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

తనను లోకేష్ తండ్రిగా ప్రధాని మోడీ అభివర్ణించారని చెప్పారు. నీకు కుటుంబం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'లోకేష్ తండ్రిగా అభివర్ణించారు. లోకేష్ మా అబ్బాయి. మీకు అబ్బాయిలు లేరు. మీకు కుటుంబం లేదు. మీకు బంధాలు లేవు. మీకు సంబంధాలు లేవు. బంధాలు లేవు. కుటుంబం వ్యవస్థను పెంచే వ్యక్తిని. కుటుంబంతో గడపాలని కోరుకునే వ్యక్తిని. ప్రతి ఒక్కరు కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందమని భావించే వ్యక్తిని' అని చంద్రబాబు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా అన్నారు. ఆయనకు భార్య ఉందని, ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతుందని ట్రిపుల్ తలాక్ తెచ్చారని గుర్తు చేశారు. జశోదాబెన్ అని ఆయన భార్య ఉందని, నేను ఆ మాట మీ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. నన్ను లోకేష్ తండ్రి అన్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. జశోదాబెన్ భర్త అని నేను అంటున్నా.. అవునా.. కాదా తమ్ముళ్లు మిమ్మల్ని అడుగుతున్నారన్నారు. జశోదాబెన్‌కు మీరు విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఆమెను పక్కన పెట్టారన్నారు. మీరు నా వ్యక్తిగత విషయాలు మాట్లాడారు కాబట్టి నేను చెబుతున్నానని అన్నారు.తల్లికి కూడా దగా చేసిన వ్యక్తి అన్నారు. లేదంటే చెప్పేవాడిని కాదని, నాకు సభ్యత ఉందని చెప్పారు.

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu questions PM Modi over his AP tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X