వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల, కాకినాడ రిజల్ట్స్: మా బలమెంటో తెలిసింది, కానీ.. :చంద్రబాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి రావాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో తమ పార్టీ బలమెంటో రాష్ట్రంతో పాటు ప్రజలందరికీ తెలిసిందన్నారు.

రాజధానిని అడ్డుకొనేందుకు కొందరు కుట్రలు పన్నారని వైసీపీపై చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి రాజధాని ప్రతీకగా నిలుస్తోందని చంద్రబాబు చెప్పారు.

ఏపీలో ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి సంబంధించిన పాటల సీడీని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి అమరావతిలో విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ పాలన సాగిస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని బాబు హమీ ఇచ్చారు.ప్రజలతో నిత్యం టిడిపి నేతలు సంబందాలు కొనసాగించేందుకు ఇంటింటికి టిడిపి కార్యక్రమం ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

60 లక్షల కుటుంబాలకు చేరుకొన్న ఇంటింటికి టిడిపి

60 లక్షల కుటుంబాలకు చేరుకొన్న ఇంటింటికి టిడిపి

‘ఇంటింటికి తెలుగుదేశం' వంటి కార్యక్రమం చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
ఇదొక నూతన అధ్యాయమన్నారు.‘ఇంటింటికి తెలుగుదేశం' పాటల సీడీని విడుదల చేశారు. 8 పాటలతో రూపొందించిన ఈ సీడీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటుందని, అందుకే, ‘ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం చేపట్టామన్నారు.సెప్టెంబర్‌ 11న ఇంటింటికీ తెలుగుదేశం ప్రారంభించామని, 60 లక్షల కుటుంబాలను తెలుగు దేశం పార్టీ నేతలు పలకరించారని వివరించారు.40 లక్షలకు పైగా కుటుంబాలకు జియో ట్యాగింగ్‌ చేశామని తెలిపారు.‘ఇంటింటికీ తెలుగుదేశం'లో సుమారు 21 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, అందులో ఎక్కువగా గృహ నిర్మాణానికి సంబంధించినవే ఉన్నాయని తెలిపారు

ప్రభుత్వ తీరుపై 80 శాతం తృప్తి కలగాలి

ప్రభుత్వ తీరుపై 80 శాతం తృప్తి కలగాలి

ప్రభుత్వం పట్ల ప్రజల్లో 80 శాతం సంతృప్తి, తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉండాలన్నారు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ‘ఇంటింటికి తెలుగుదేశం' ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా వెళుతున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమం చరిత్రలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. ఇదో నూతన అధ్యాయమని చెప్పారు.ప్రజల్లో ఉత్సాహం ఉంది కాబట్టే తమ నాయకులు అమితమైన ఉత్సాహంతో పని చేస్తున్నారని ప్రశంసించారు.

మా బలమెంటో తెలిసింది

మా బలమెంటో తెలిసింది

కాకినాడ, నంద్యాలలో జరిగిన ఎన్నికల ద్వారా తెలుగుదేశం పార్టీ బలమేంటో రాష్ట్రంలోనే కాకుండా అందరికీ తెలిసిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. నంద్యాల ఎన్నికల ఫలితాలు టిడిపి శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహన్ని నింపినట్టుగా చంద్రబాబు చెప్పారు.ప్రజలకు సేవ చేస్తే ఇదే తరహ ఫలితాలు వస్తాయన్నారు.రానున్న రోజుల్లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఇవే రకమైన ఫలితాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొనే కుట్ర

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొనే కుట్ర


రాజధానిని అడ్డుకునేందుకు కుట్ర చేశారని ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి రాజధాని ప్రతీక అని పేర్కొన్నారు. ఆర్థిక కష్టాలు లేని రాష్ట్రాలు... రైతు రుణమాఫీ చేయలేదన్న ఆయన.. టీడీపీ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేశామన్నారు. పేదవాళ్ల ఖర్చు తగ్గించేందుకు విద్య, వైద్య సదుపాయాల కల్పిస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవస్థలను గాడిలో పెట్టడంతో రాజకీయ నేతలు, అధికారులపై గౌరవం పెరిగిందన్నారు.

English summary
Tdp chief Chandrababu naidu released intintiki tdp songs CD on Monday at Amaravati.He spoke to media on Monday night at Amaravati.Chandrababu Naidu said that opposition parties tried to stop capital city at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X