వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి చేసుకోకపోతేనే మంచి లైఫ్ అనే ఆలోచనే కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: పెళ్లి చేసుకోకపోతే మంచి జీవితం గడపొచ్చనే ఆలోచనే కాదంటున్నారు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు. అంతేకాదు పెళ్లి,పిల్లలు, జీవితం గురించి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఏపీ రాష్ట్ర హెల్త్ బులెటిన్ విడుదల సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Chandrababu naidu recalls his previous plan in elections

పెళ్లి చేసుకున్నా పిల్లలు వద్దనే కండిషన్ తోనే కొందరు పెళ్లి చేసుకుంటున్నారని, అది కూడా కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఆదివారం అమరావతిలో ఏపీ రాష్ట్ర హెల్త్ బులెటిన్ ను చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది.

Chandrababu Naidu releases new health bulletin for Andhra Pradesh

హెల్త్ బులెటిన్ విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...ప్రతి నెలా 4వ తేదీన ఎపి హెల్త్ బులెటిన్ ను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అందరి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలనే లక్ష్యంతోనే నూతన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోనే "పలకరింపు" అనే పథకాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శిశు మరణాల సంఖ్య తగ్గింపే లక్ష్యంగా వారి ఆరోగ్య పరిరక్షణకు కోసమే ఈ 'పలకరింపు' పథకం అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన ఉండాలని, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని తెలుసుకోవాలన్నారు.

ఇలా ప్రాంతాల వారీగా వ్యాధుల గుర్తింపు, వాటి పరిష్కారం చూడాలనే లక్ష్యంతో ప్రతి ఆరోగ్య సమస్య పరిష్కారానికి రీసెర్చ్ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసి, చికిత్స ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని,రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేది తన అభిలాష అని, అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు కోరారు.

English summary
Amaravathi: Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Sunday released a new state health bulletin, aimed at improving the healthcare sector of the state. Naidu further said that health bulletin should be released at village and district levels across Andhra Pradesh on the fourth of every month. During the event, a new programme aimed at child healthcare, named "Palakarimpu" was introduced. "If minor health issues are treated immediately, they can be prevented in initial stages. In future, everyone's health records will be connected to Aadhaar for providing medical services. Within one year, we will make the state a role model," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X