Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్, మనం నష్టపోవడమెందుకు: మంత్రులపై బాబు ఆగ్రహం (పిక్చర్స్)

గుంటూరు/అమరావతి: జరిగింది జరిగిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని, కేంద్రం ఇరువురినీ ఒప్పించి రాష్ట్ర విభజన చేసి ఉంటే ఒకలా ఉండేదని, ఇప్పుడూ ఇద్దరం నష్టపోవడం ఎందుకని, సానుకూల దృక్పథంతో వెళ్లాలనేది తన అభిమతమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిజేయమని కేంద్రాన్ని కోరుతున్నామని, తెలంగాణకు ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలని కోరడం లేదని, నష్టాన్ని మాత్రం పూడ్చాలని కోరుతున్నామన్నారు. ఏపీకి, తెలంగాణకు నష్టం జరగాలనేది తన అభిమతం కాదన్నారు.

మంగళవారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి అంతా ఒకటేనని, ఈ విషయంలో తేడాలు లేవన్నారు. ప్రభుత్వాలు వేరని, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలనేది తన కోరికన్నారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు చర్చ గురించి ప్రస్తావించగా రెండు ప్రభుత్వాలు ఎలా ముందడుగు వేయాలనేది ప్రాథమికంగా చర్చకు వచ్చిందని చంద్రబాబు జవాబిచ్చారు.

తెలంగాణ నేతలు

తెలంగాణ నేతలు

అమరావతి రాజధాని కోసం సేకరించిన మన నీరు మన మట్టి మన అమరావతి కార్యక్రమంలో తెలంగాణ టిడిపి నేతలు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ నేతలు

తెలంగాణ నేతలు

అమరావతి రాజధాని కోసం సేకరించిన మన నీరు మన మట్టి మన అమరావతి కార్యక్రమంలో తెలంగాణ టిడిపి నేతలు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అందరి ఆశీర్వాదాలు

అందరి ఆశీర్వాదాలు

అందరి ఆశీర్వాదాలున్న కార్యక్రమం.. అమరావతి శంకుస్థాపన గొప్ప శుభకార్యమని, దీని ద్వారా చరిత్రకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు చెప్పారు. అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

గౌరవంగా పంపించాలి

గౌరవంగా పంపించాలి

శంకుస్థాపన మహోత్సవానికి వస్తున్న అతిథులను గౌరవంగా చూసుకుని వారిని తిరిగి పంపించడం మన బాధ్యత అని, చరిత్రలో ఎన్నడూ జరగని పవిత్ర కార్యక్రమం ఇధి అన్నారు. మహా సంకల్పం చేపట్టామన్నారు.

పవిత్ర జలాలు

పవిత్ర జలాలు

పవిత్ర జలాలు తీసుకొచ్చామని, 16 వేల గ్రామాలు, వార్డుల నుంచి మట్టి, నీరు తెచ్చామని, అందరు దేవుళ్ల నుంచి అమరావతికి ఆశీర్వాదం తీసుకున్నామని, సీఆర్డీఏ ప్రాంతంలో ఈ నీళ్లు, మట్టి కలిపిన తర్వాత ఈ ప్రాంతాన్ని శక్తిమంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నామన్నారు.

మరో నగరం లేదు

మరో నగరం లేదు


దేశ చరిత్రలో ఇంత ప్రయత్నం చేసి నిర్మిస్తున్న నగరం మరొకటి ఇప్పటివరకు లేదన్నారు. భారత జాతి మొత్తం అమరావతిని చూసి గర్వపడాలని, విజయవాడ కనకదుర్గ, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయాలు, దర్గా, చర్చీల నుంచి నాలుగు జ్యోతులు వచ్చాయన్నారు.

కాలనాళిక

కాలనాళిక

మట్టి-నీరు కలిపిన తర్వాత అమరావతి సంకల్ప పత్రాలన్నింటినీ కాలనాళికలో (టైమ్ క్యాప్యూల్) భద్రపరుస్తామని, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, తమిళనాడు, అస్సాం, మిజోరం రాష్ట్రాల గవర్నర్లు వస్తున్నారని, సింగపూర్‌, జపాన్‌ల నుంచి మంత్రులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు వస్తారన్నారు.

ఎవర్నీ విమర్శించను

ఎవర్నీ విమర్శించను

ఈ శుభ సందర్భంలో ఎవర్నీ విమర్శించదలచుకోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నష్టం చేయడమే కాకుండా మన కష్టం మీద నిలబడుతుంటే వెనుక్కు లాగుతోందన్నారు. రాహుల్ గాంధీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

ఏపీ 16 నెలల పసిపాప

ఏపీ 16 నెలల పసిపాప


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 16 నెలల పసిపాప.. చిన్నపిల్లల కంటే జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. విభజన సమయంలో ప్రకటించిన హామీలతో పాటు ప్రత్యేక హోదా, ప్యాకేజీ కూడా ఇవ్వాలన్నారు. రైతులు స్వచ్ఛందంగా సహకరించారన్నారు. అమరావతిని కట్టుకోవడానికి ఎందుకు కాంగ్రెస్‌ అడ్డుపడుతోందన్నారు.

జగన్ పైన చంద్రబాబు మండిపాటు

జగన్ పైన చంద్రబాబు మండిపాటు

శుభకార్యం చేస్తుంటే విరోధైనా ఆశీర్వదిస్తారని, పిలవొద్దని అనడం ఎక్కడైనా విన్నారా? ఎవరైనా అన్నారా? నా రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని మాత్రం చూడలేదని, ప్రతిపక్షనేతను ఎలా అన్వయించాలో తనకే తెలియడం లేదని జగన్ పైన చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి భారీ కార్యక్రమాల సమయంలో కావాలనే కొందరు వదంతులు వ్యాప్తి చేస్తారుని, వాటిని నమ్మొద్దన్నారు.

బాబు ఆగ్రహం

బాబు ఆగ్రహం

మిమ్మల్ని నమ్మి నేను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించానని, ఇలాగేనా పనులు చేయించేది? ఈ రోడ్లు ఎప్పటికవుతాయి? జంగిల్‌ క్లియరెన్స్‌ అయినా సరిగా చేయించాలి కదా... అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇప్పటివరకూ జరిగిన పనుల గురించి తనకు వాస్తవ సమాచారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారని సమాచారం.

 బాబు ఆగ్రహం

బాబు ఆగ్రహం

ప్రజలు ఎంత మంది వస్తారో మీకు తెలియదా? అంచనాలైనా ఉన్నాయా? ఒకరి మధ్య మరొకరికి సమన్వయం ఉందా? నా అంచనాల మేరకు సమన్వయ లేమి బాగా ఉన్నట్లుందని సీఎం మంగళవారం సమీక్షల సందర్భంగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+