వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నిపార్టీలకు చంద్రబాబు లేఖ: చారిత్రక అవకాశం, లీడ్ చేయాలంటూ ఎంపీలకు ఆదేశం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: లోక్‌సభలో శుక్రవారం అవిశ్వాసంపై చర్చ జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అన్ని పార్టీల అధినేతలు, ఎంపీలకు లేఖ రాశారు. అవిశ్వాసానికి తీర్మానానికి మద్దతివ్వాలని లేఖలో సీఎం కోరారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్న టీడీపీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం
లేఖలో చంద్రబాబు..

లేఖలో చంద్రబాబు..

ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూలోటు, రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్, అమరావతి, వెనుకబడిన జిల్లాలకు నిధుల అంశాలను సీఎం చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. రాజ్యసభలో నాటి ప్రధాని హామీలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. నాడు హోదా కోసం పట్టుబట్టిన బీజేపీ నేతలు ఇవాళ వెనక్కి వెళ్లారని తెలిపారు. పునర్విభజన చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కోరిన టీడీపీ ఎంపీలు: ముందుకొచ్చిన స్టాలిన్, షాకిచ్చిన పళని అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కోరిన టీడీపీ ఎంపీలు: ముందుకొచ్చిన స్టాలిన్, షాకిచ్చిన పళని

ప్రారంభం-ముగింపు మనదే కావాలి

ప్రారంభం-ముగింపు మనదే కావాలి

విశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు సిద్ధం కావాలని ఎంపీలు గల్లాజయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీనే ప్రారంభించాలని తెలిపారు. చర్చ ముగింపు కూడా టీడీపీతోనే జరగాలని ఎంపీలకు సీఎం సూచనలు చేశారు.

ఎక్కువ సమయం తీసుకోండి

ఎక్కువ సమయం తీసుకోండి

విభజన చట్టంలో ఉన్న 19 అంశాలపై విస్తృతంగా చర్చించాలని, మద్దతిచ్చే అన్ని పార్టీల నేతలతో మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదొక చారిత్రక అవకాశమని అన్నారు. 7గంటలపాటు అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశముందని, టీడీపీ 15నిమిషాలు కేటాయించే అవకాశం ఉందని, కానీ, ఇంకా ఎక్కువ సమయం కోరాలని సూచించారు. 5కోట్ల ప్రజల గొంతుకను లోకసభ వేదికగా వినిపించాలని చంద్రబాబు చెప్పారు.

 మోసాన్ని వివరిస్తాం

మోసాన్ని వివరిస్తాం

విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ప్రభుత్వం చేసిన మోసాన్ని పార్లమెంటు సాక్షిగా వివరిస్తామని టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ అన్నారు. విభజన సమయంలో ఏపీకి హక్కుగా వచ్చిన హామీలను కేంద్రం పట్టించుకో లేదని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను దేశ ప్రజలకు వివరించేందుకు కూడా అవిశ్వాసంపై చర్చ ఉపయోగపడుతుందని చెప్పారు.

పార్లమెంటుకు వచ్చేది లేదు, ఏమౌతుంది?: టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు పార్లమెంటుకు వచ్చేది లేదు, ఏమౌతుంది?: టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు

English summary
TDP President and Chief Minister Nara Chandrababu Naidu has wrote a letter to all Members of Parliament in the country, seeking support for the No Confidence Motion moved by the party in the Lok Sabha against Prime Minister Narendra Modi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X