హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు కోహ్లీ ఉన్నాడు, బాధపడ్డాను: జగన్‌కు బాబు విజ్ఞప్తి, మోడీపై తీవ్రవ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నంలో జరిగిన కత్తి దాడి ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కడపలోని ధర్మపోరాట దీక్షలో మాట్లాడారు. మొన్న కోడి కత్తి డ్రామా జరిగిందని ఎద్దేవా చేశారు.

<strong>అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే</strong>అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే

జగన్ పైన కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో ఉన్న విమానాశ్రయంలో దాడి జరిగిందని గుర్తు చేశారు. తాను జగన్ వీరాభిమానిని అని, జగన్ పైన సానుభూతి వచ్చేందుకే దాడి చేశానని నిందితుడు శ్రీనివాస రావు చెప్పారన్నారు. అతనే చేశాడా లేక వారు చేయించుకున్నారా తెలియాల్సి ఉందని చెప్పారు.

కోహ్లీ నుంచి చాలామంది ఉన్నారు, బాధపడ్డాను

కోహ్లీ నుంచి చాలామంది ఉన్నారు, బాధపడ్డాను

కోహ్లీ నుంచి ప్రతి క్రికెటర్ విశాఖపట్నంలో ఉన్నారని, అలాంటప్పుడు ఈ ఘటన జరిగిందని, అప్పుడు ఏపీకి అప్రతిష్ట వస్తుందని బాధపడ్డానని, జగన్‌తో మాట్లాడాలనుకున్నానని, కానీ తననే ఏ1 అన్నారని వాపోయారు. తన రాజకీయ జీవితంలో హత్యాప్రయత్నాలు చేశానా అన్నారు. ముఠాలపై, మతసామరస్యం కోసం పోరాడానని చెప్పారు. తీవ్రవాదుల కోసం పోరాడానని అన్నారు. ఎక్కడా లాలూచీ పడలేదన్నారు. నేను రాజకీయ పోరాటం చేశాను తప్ప, కక్షలు లేవన్నారు. అలాంటి వాటిపై లేనిపోని ఆరోపణలా అన్నారు.

Recommended Video

జగన్ దాడితో మాకేం సంబంధం : చంద్రబాబు
 శివాజీ చెబితే నమ్మలేదు, కేంద్రానికి హెచ్చరిక

శివాజీ చెబితే నమ్మలేదు, కేంద్రానికి హెచ్చరిక

నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ గురించి చాలా స్పష్టంగా చెప్పారని చంద్రబాబు అన్నారు. శివాజీ గత మార్చిలో చెబితే తాను మొదట నమ్మలేదని, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నమ్మాల్సి వస్తోందని అన్నారు. శాంతిభద్రతలు కాపాడుతామన్నారు. అనవసరంగా తప్పుడు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయాలంటే తెలుగుజాతి పౌరషం చూపిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. మీకు భయపడాలా అన్నారు.

జగన్! మీరే బాధితులు, మీరు సహకరించాలి

జగన్! మీరే బాధితులు, మీరు సహకరించాలి

విశాఖపట్నంలో దాడి జరిగితే, ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాదుకు వెళ్లి అక్కడకు వెళ్లి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నేను ఎవరినీ వదిలిపెట్టనని, ధర్మాన్ని కాపాడుతానని చెప్పారు. కోడి కత్తి కేసులో ఏం జరిగిందో తేలాల్సి ఉందని అన్నారు. మీరు వాంగ్మూలం ఇవ్వాలని, మీరే బాధితుడని జగన్‌ను ఉద్దేశించి చెప్పారు. మీ కార్యకర్తనే దాడి చేశారని, మీరు నమ్ముకున్న కేంద్రం ఆధీనంలోని విమానాశ్రయంలో దాడి జరిగిందని, మీరూ (జగన్) సహకరిస్తే విచారణ సజావుగా సాగుతుందన్నారు. తద్వారా వాంగ్మూలం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

పోలీసులపై నమ్మకం లేకుంటే ఇంకెవరిని నమ్ముతారు?

పోలీసులపై నమ్మకం లేకుంటే ఇంకెవరిని నమ్ముతారు?

ఏపీ పోలీసులపై మీకు నమ్మకం లేకుంటే ఎవరిపై నమ్మకం ఉంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ పోలీసు వ్యవస్థ శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. కోడి కత్తిలో నిజాలు నిర్ధారించాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేసిందన్నారు. జగన్ పైన దాడి జరిగినప్పుడు డీజీపీకి గవర్నర్ నేరుగా ఫోన్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

 మోడీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

మోడీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

ఈ రోజు సీబీఐ అపహాస్యం అయిందని చంద్రబాబు అన్నారు. దేశంలో మతసామరస్యం దెబ్బతింటోందన్నారు. వ్యవస్థను అభివృద్ధికి ఉపయోగించుకుంటే మోడీకి సహరిస్తామని, ప్రత్యర్థులపై వాడితో ఊరుకునేది లేదన్నారు. నోట్ల రద్దు తీరును చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతిని అంతం చేస్తానని అధికారంలోకి వచ్చి మోడీ చేసిందేమీ లేదన్నారు. గుజరాత్ నుంచి మనుషులను తీసుకు వచ్చి ఆఫీసర్లుగా పెట్టుకొని, దేశంపై దాడి చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇప్పటి వరకు జరిగిన ఐటీ దాడులు కొనసాగే అవకాశముందన్నారు. అందుకే తాను ఢిల్లీకి వెళ్లి అందర్నీ సమీకృతం చేస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని చెప్పారు. మనం 25 పార్లమెంటు స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో గెలవలాన్నారు. స్వార్థం కోసం కేసుల విషయంలో జగన్ వంటి వారు భయపడుతున్నారని, అలాంటి వారు నాయకులు కాలేరన్నారు. నాడు ఇందిరా గాంధీకి, నేడు మోడీకి తాను భయపడలేదని, భయపడటం లేదని, అందుకు తన నీతి, నిజాయితీలే కారణమన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu responds on attack on YS Jagan and lashes out at Modi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X