వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో నవంబర్‌లో బడ్జెట్, ఖర్చులు తగ్గించండి: బాబు, జీఎస్టీతో భారం

ఏపీలో వార్షిక బడ్జెట్‌ను నవంబర్ నెలలో ప్రవేశ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి - డిసెంబర్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలన్న కేంద్రం నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో వార్షిక బడ్జెట్‌ను నవంబర్ నెలలో ప్రవేశ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి - డిసెంబర్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలన్న కేంద్రం నిర్ణయించింది.

పురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా? చంద్రబాబుపై గేరు మార్చిన బిజెపిపురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా? చంద్రబాబుపై గేరు మార్చిన బిజెపి

ఇది అమలు అయితే బడ్జెట్‌ను డిసెంబర్ లోపు ప్రవేశ పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే నవంబర్ నెలలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ మేరకు చంద్రబాబు అధికారులకు సూచన చేశారు.

 Chandrababu Naidu review on financial year

సాధారణంగా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నాం. కేంద్రం నిర్ణయం అమలు అయితే ప్రస్తుత ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న కాలాన్ని ట్రాన్షిషనల్ ఫైనాన్షియల్ ఇయర్‌గా పరిగణించాలని చంద్రబాబు చెప్పారు.

గురువారం వెలగపూడి సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సంబంధిత శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వానికి వచ్చిన ఆధాయ వ్యవయాలపై సమీక్షించారు.

ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి ఏకంగా రూ.2,485 కోట్లు ఖర్చు చేసింది. దీనిపై చర్చ జరిగింది. ఖర్చులు తగ్గించాలని చంద్రబాబు సూచించారు.

జీఎస్టీ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.2,900 కోట్ల మేర రాబడి తగ్గే అవకాశాలున్నట్లు చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ వల్ల ఆర్థిక లోటు ఏర్పడకుండా రాబోయే ఐదు, పదేళ్లలో వచ్చే ఆదాయ అంచనాలను మదింపు వేసి ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Thursday revied on financial year issue with minister Yanamala Ramakrishnudu and officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X