వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమయానికి జేసీ దెబ్బ, రంగంలోకి అధిష్టానం: రాజకీయ కారణాలున్నాయా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

జేసీ దివాకర్ రెడ్డి కి టీడీపీ నేతలు బుజ్జగింపులు

అనంతపురం/అమరావతి: అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన తీరుపై పార్టీ అధిష్టానం, సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. అవిశ్వాసం చాలా కీలకమని, ఇలాంటి సమయంలో ఆయన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.

సుజనాచౌదరి వల్లే.. అవిశ్వాసానికి దూరంగా ఉంటా: టీడీపీకి జేసీ షాక్, బుజ్జగింపుసుజనాచౌదరి వల్లే.. అవిశ్వాసానికి దూరంగా ఉంటా: టీడీపీకి జేసీ షాక్, బుజ్జగింపు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఓ వైపు ఎంపీలతో అవిశ్వాసంపై సంప్రదింపులు జరుపుతూ.. జేసీ వ్యవహారంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఓ వైపు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతుంటే సొంత పార్టీ ఎంపీ ఇలా అలక వహించడం సరికాదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: బాబు వ్యూహమే: కేశినేని, టీడీపీకి టీఆర్ఎస్ షాక్.. ఎవరిని అడిగి అవిశ్వాసం పెట్టారు

 జేసీ అసంతృప్తిపై రంగంలోకి అధిష్టానం

జేసీ అసంతృప్తిపై రంగంలోకి అధిష్టానం

జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆయన అసంతృప్తికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. ఇందుకోసం పలువురు నేతలకు సూచనలు చేసింది. జేసీ అసంతృప్తికి అసలు కారణం ఏమిటి, రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

సీఎం నివాసానికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

సీఎం నివాసానికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

జేసీ ఇష్యూ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. ఇదిలా ఉండగా, జేసీ సమస్య సాయంత్రానికల్లా తీరుతుందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించేందుకు ఇప్పటికే పలువురు నేతలు రంగంలోకి దిగి, ఆయనతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

తర్వాత చూసుకోవాలి, సరికాదు

తర్వాత చూసుకోవాలి, సరికాదు

అవిశ్వాస తీర్మానం సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు ఏమాత్రం సరికాదని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర అంశాలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చునని చెప్పారు. కానీ కీలక సమయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కొనకళ్ల నారాయణ వంటి వారు అంటున్నారు.

చర్చ ప్రారంభించేది కేశినేని కాదు.. గల్లా

చర్చ ప్రారంభించేది కేశినేని కాదు.. గల్లా

తాను ఎలాంటి పరిస్థితుల్లోను పార్లమెంటుకు హాజరుకాబోనని జేసీ దివాకర్ రెడ్డి చెబుతోన్న విషయం తెలిసిందే. తద్వారా అవిశ్వాసానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాలనుకుంటున్నానని బుధవారమే అన్నారు. తనకు, ఎంపీలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్లమెంటులో మాట్లాడే అవకాశం ముగ్గురికే వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. కాగా, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చను కేశినేని నాని కాకుండా.. గల్లా జయదేవ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీడీపీ నిర్ణయించింది.

English summary
As the TDP's no confidence motion is taken up on Friday, one of its own lawmakers has threatened to bunk parliament. JC Diwakar Reddy says he is fed up with the centre and his party's government in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X