వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అంతర్జాతీయస్థాయిలో మేనేజ్ చేశారంటే, అందుకే బాబుకు ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానమా?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసం చేయడంలో అంతర్జాతీయస్థాయికి ఎదిగారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. సెప్టెంబర్ 24వ తేదీన న్యూయార్క్‌లో జరగనున్న యూఎన్ జనరల్ అసెంబ్లీలో వ్యవసాయంపై మాట్లాడాలని ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చింది. దీనిపై వైసీపీ నేత విమర్శలు గుప్పించారు.

మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. ప్రకృతి సేద్యానికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారట... ఈ విషయం మన రైతులు, ప్రజలకు తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రసంగించేందుకు ఆయనను ఆహ్వానించారట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అసలు వ్యవసాయ విషయంలో అంతర్జాతీయ గౌరవం పొందే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

ఇలా చేసినందుకు ఆహ్వానం వచ్చిందా

ఇలా చేసినందుకు ఆహ్వానం వచ్చిందా

హామీలను అమలు చేయకుండా రైతులను దగా చేసినందుకు చంద్రబాబుకు ఆహ్వానం అందిందా అని నాగిరెడ్డి ప్రశ్నించారు. రైతుల భూములు బలవంతంగా లాక్కునే భూవిధానాన్ని అమలు చేస్తున్నందుకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానించిందా అన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు అంతర్జాతీయ గౌరవాలు అందుకునేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. ఆయనకు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం రావడం హాస్యాస్పదం అన్నారు.

 చంద్రబాబు ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఏం చెప్పిందో కానీ

చంద్రబాబు ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఏం చెప్పిందో కానీ


చంద్రబాబు నరనరాన రైతు వ్యతిరేకతను జీర్ణించుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం మరీ చోద్యం అన్నారు. 2024 నాటికి ఏపీలో 60 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట, ఈ విషయం మన రైతులకు, మన దేశంలోని వారికి తెలియదు కానీ, ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి వారికి ఏం చెప్పిందో కానీ ప్రకృతి వ్యవసాయానికి చంద్రబాబు ఏవో సేవలు చేస్తున్నారని భావించి ప్రసంగించాలని కోరారని విమర్శించారు. మాయమాటలు చెప్పి మోసం చేయడంలో అంతర్జాతీయస్థాయికి ఎదిగారని ఇది నిరూపిస్తోందన్నారు.

ఐక్యరాజ్య సమితిని మేనేజ్ చేశారంటే!

ఐక్యరాజ్య సమితిని మేనేజ్ చేశారంటే!

అన్ని రకాలుగా వ్యవసాయాన్ని నాశనం చేసి, చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రైతులను మోసగించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. వారిని అప్పులపాలు చేశారన్నారు. కానీ రాష్ట్రంలో తాను ప్రకృతి వ్యవసాయాన్ని బాగా చేయిస్తున్నట్టుగా అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్‌ చేశారంటే ఇది మన రైతులు, ప్రజలు గర్వపడాల్సిన విషయమా అన్నారు.

సమాధానం చెప్పాలి

సమాధానం చెప్పాలి

గత నాలుగున్నరేళ్ల పాలనలో రైతుకు, వ్యవసాయానికి చంద్రబాబు చేయని ద్రోహం ఉందా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేకి అయిన చంద్రబాబు వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో అంతర్జాతీయ గౌరవాలను అందుకునేందుకు అర్హుడు కాదని అభిప్రాయపడ్డారు. అసలు ఆయనను ఎందుకు గౌరవించాలన్నారు. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాలన్నారు.

English summary
Telugu Desam Party president and Andhra Pradesh chief minister N Chandrababu Naidu has got an invitation from the United Nations Organisation to speak on the topic: “Financing sustainable agriculture: Global challenges and opportunities,” at the UN General Assembly at New York on September 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X