వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనన్న ఏమిటీ.. అసలు మహిళలు అంగీకరిస్తారా?: చంద్రబాబు, మంచే జరుగుతుందని జగన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి, 11 ఛార్జీషీట్లలో పేరు కలిగి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏ మహిళా అన్నగా అంగీకరించదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగనన్న ఏమిటని విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగనన్న అని పిలుచుకుంటారు.

అన్న పిలుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే అన్న వస్తున్నాడని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్సైలకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారన్నారు. వైసీపీ నేతలు ఈ తరహా ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతారన్నారు. వీరి వ్యవహరంపై నిఘా పెట్టాలన్నారు.

<strong>పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్‌పై పోటీ చేస్తా: కేఏ పాల్</strong>పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్‌పై పోటీ చేస్తా: కేఏ పాల్

 జగన్‌కు ఆర్థిక నేరస్తుడు ఎలా ఉంటాడో తెలుసు

జగన్‌కు ఆర్థిక నేరస్తుడు ఎలా ఉంటాడో తెలుసు

గురువారం ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అన్న పిలుపు పేరుతో జగన్ తటస్థులకు లేఖ రాయడం, వారిని కలుస్తుండటంపై స్పందించారు. ఓ ఆర్థిక నేరస్థుడిని ఎవరూ అన్నగా అంగీకరించరని చెప్పారు. జగన్‌కు ఓ నేరస్థుడు ఎలా ఉంటాడో తెలుసు తప్ప, అన్న ఎలా ఉండాలన్న సంగతి తెలియదని చెప్పారు.

అన్నగా ఎలా ఉండాలో తెలుసా?

అన్నగా ఎలా ఉండాలో తెలుసా?

అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని దగ్గర చేసిందన్నారు. ప్రతిపక్ష వైసీపీ ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తోందన్నారు. వారు ఎన్ని ప్రకటనలు చేసినా నష్టం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. మహిళలకు ఇచ్చిన పసుపు కుంకుమ చెక్కులను పంపించి ఊరుకోవద్దని, వాటిని బ్యాంకులో వేయించి, డబ్బులు తీసుకునేంత వరకు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.

అంతా మంచి జరుగుతుంది

అంతా మంచి జరుగుతుంది

ఏ రాజకీయ పార్టీకి చెందని ఓటర్లను టార్గెట్ చేసుకుంటూ, వారికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు. ఆయన పలువురితో భేటీ అవుతున్నారు. చిత్తూరు జిల్లా తనపల్లె క్రాస్ వద్ద ఉన్న ఫంక్షన్ హాలులో గురువారం భేటీ అయ్యారు. ప్రభుత్వం ఎలా పని చేయాలో సూచిస్తే, తాను దానిని ఆచరణలో పెట్టి చూపిస్తానని తటస్థుల భేటీలో అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాన్ని గమనిస్తున్నానని, తమ ప్రభుత్వం వచ్చాక అంతా మంచి జరుగుతుందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు నడు బిగిస్తామని చెప్పారు.

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu satire on YSRCP chief YS Jagan Mohan Reddy's Anna Pilupu and Jagananna comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X