నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వద్దకు వెళ్లడం ఇబ్బంది, సలహాదారు కావాలి: ముస్లీం నేత

సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేసేందుకు కష్టం అవుతోందని ముస్లీం ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేసేందుకు కష్టం అవుతోందని ముస్లీం ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ అన్నారు.

చదవండి: పవన్ కళ్యాణ్‌పై విమర్శలు: సమాధానం ఇవ్వాలని తమ్ముడికి నాగబాబు

హామీలు నెరవేర్చాలి

హామీలు నెరవేర్చాలి

మునీర్ మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు, అలాగే నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ముస్లీంలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

టిడిపి గెలుపు వెనుక మైనార్టీలు

టిడిపి గెలుపు వెనుక మైనార్టీలు

2014లోని సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో మైనార్టీ ముస్లీంలు తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించారని అహ్మద్ తెలిపారు. దీనిని అధికార పార్టీ గుర్తించిందని, అందుకు థ్యాంక్స్ అన్నారు.

జలీల్ ఖాన్ సహా ముగ్గురికి పదవులు

జలీల్ ఖాన్ సహా ముగ్గురికి పదవులు

ముస్లీంలు సహకరించిన విషయం గుర్తించిన సీఎం చంద్రబాబు శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్‌ఎండి ఫరూక్‌ను ఎంపిక చేయడం, వక్స్‌బోర్డు ఛైర్మన్‌గా జలీల్ ఖాన్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నాగుల్‌మీరాను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు.

చంద్రబాబుది బాధ్యత

చంద్రబాబుది బాధ్యత

ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న ముస్లింలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత మైనార్టీ శాఖను చూస్తున్న చంద్రబాబుపై ఉందన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu should have advisor for minority issues, said Muslim JAC leader Shaik Muneer Ahmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X