వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజూ బూతులు వినాల్సి వస్తోంది, లింకన్, నెహ్రూ కలలుకన్న సమాజం ఏదీ, చంద్రబాబు ధ్వజం..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. దీపావళి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సర్కార్ తీరుపై మండిపడ్డారు. చీకట్లను పారదోలే వెలుగుపూల దీపావళి తెలుగువారి లోగిళ్లలో ఆనంద దీపావళి కావాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కరోనా కల్లోలం, వరుస వరద విపత్తులతో ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారని తెలిపారు.

కుంభకోణాల మయం..

కుంభకోణాల మయం..

పాలకులు అవినీతి కుంభకోణాలు ఆగడం లేదని విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆశావహ దృక్పథం ఒక్కటే మన జీవితాలలో వెలుగులు నింపుతుంది అని చంద్రబాబు అన్నారు. అప్పులు తెచ్చి, అవినీతి పనులు చేస్తూ సొంత జేబులు నింపుకోవడం సరికాదన్నారు. సంపద సృష్టించే ఆలోచనలు పాలకులకు రావాలని కోరారు.

బూతులు వినాల్సి వస్తోంది..

బూతులు వినాల్సి వస్తోంది..

పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు జీవనోపాధి మార్గాలు పెంచే దిశగా కృషిచేయాలన్నారు. మానవాళి భవితవ్యం పిల్లల చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రస్తుతం మనం మంచి పనులు చేస్తే రేపటి సమాజాన్ని కూడా మంచిగా ఉంచే బాధ్యత పిల్లలు తీసుకుంటారని అబ్రహాం లింకన్ తెలిపారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం అన్నారు. తల్లిదండ్రులతో కలిసి బిడ్డల సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోందన్నారు.

ఉజ్వల భవిష్యత్..

ఉజ్వల భవిష్యత్..

విద్యాభ్యాసం పూర్తిచేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని చంద్రబాబు అన్నారు. వర్సిటీలు, పారిశ్రామిక వేత్తలు, కంపెనీలకు వారధిగా విద్యావ్యవస్థను ఇదివరకు తీర్చిదిద్దాం అని తెలిపారు. కానీ ఇప్పుడు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వాటాల కోసం పరిశ్రమలను బెదిరించి వెళ్ళగొడుతున్నారని తెలిపారు. దీంతో యువత ఉపాధి లేకుండా పోతుందన్నారు. దీంతో పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని అడిగారు.

ఆ దిశగా సమాజం..

ఆ దిశగా సమాజం..


స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి.. పిల్లల గురించి బాధ్యతగా ఆలోచించాలని కోరారు. ఈ విషయాన్ని అబ్రహం లింకన్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలు కలలు కన్నారని తెలిపారు. అలాంటి సమాజం కోసం కృషి చేయాల్సి ఉందన్నారు.

English summary
tdp chief chandrababu naidu slams ap cm ys jagan mohan reddy on childrens issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X